![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 28, 2025, 08:17 AM
మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి పాత్ర లేదని, ఉందని కోర్టు తీర్పిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతా అంటూ వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైయస్ఆర్ జిల్లా కడప నగరంలోని పార్టీ కార్యాలయంలో గురువారం రాచమల్లు శివప్రసాదరెడ్డి మీడియాతో మాట్లాడుతూ..... వివేకానందరెడ్డి హత్య జరిగి ఆరేళ్లయినా టీవీ సీరియల్ మాదిరిగా టీడీపీ ఇంకా మాట్లాడుతూనే ఉంది. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని తప్పుడు కథనాలు అచ్చేస్తూనే ఉన్నారు. ఒకపక్క కేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్నా అవినాశ్ డైరెక్షన్..పీఏ కృష్ణారెడ్డి యాక్షన్ అని రాస్తున్నారంటే ఎల్లో మీడియా కుట్రలకు అంతే లేదనిపిస్తుంది. ఎంతసేపటికీ ఈ హత్య కేసులో వైయస్ జగన్‌ను ఇరికించాలని తాపత్రయం తప్పించి, అధికారంలో ఉండి ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయాలన్న చిత్తశుద్ధి చంద్రబాబులో కనిపించడం లేదు. చనిపోయిన వ్యక్తి మా కుటుంబ సభ్యుడే అయినా వైయస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేసే కుట్రల్లో భాగంగా పదే పదే ఎంపీ అవినాశ్ రెడ్డి మీద తప్పుడు ఆరోపణలు చేసి తద్వారా వైయస్ జగన్‌ని, వైయస్ఆర్‌సీపీని రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని విశ్వపత్రయత్నాలు చేస్తున్నారు. వివేకా రక్తాన్ని తెచ్చి వైయస్ జగన్ చొక్కాకు పులమాలని ఈ ఆరేళ్లుగా చేయని కుట్రలు లేవు. ఏబీయన్, ఆంధ్రజ్యోతి, ఈనాడు, మహాన్యూస్ వంటి ఛానెళ్లు, పేపర్లు కలిసి కొన్ని కోట్ల మంది దగ్గర వారి కుటుంబ గౌరవాన్ని పలచన చేశారు. తనకేపాపం తెలియకపోయినా టీడీపీ చేస్తున్న కుట్రల కారణంగా ఈ ఆరేళ్లుగా అవినాశ్ రెడ్డి తీవ్రమైన నరకం అనుభవిస్తున్నాడు. తమ అబద్ధాన్ని, ప్రచారాన్ని నిజం చేయడానికి సీబీఐ సహా అన్ని వ్యవస్థలను కలుషితం చేశారు. మీడియాతో నిత్యం అబద్ధాలు మాట్లాడిస్తున్నారు. పోలీసులు కూడా ప్రభుత్వం ఏది చెబితే దానికి డూడూ బసవన్న అన్నట్టు తల ఊపుతున్నారు అని మండిపడ్డారు.
Latest News