![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 28, 2025, 02:35 PM
ప్రపంచమంతా భారత్‌వైపు చూస్తోందని.. ఇకపై భవిష్యత్ అంతా భారతీయులదే అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఐఐటీ మద్రాస్‌లో ఆలిండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్‌లో సీఎం మాట్లాడుతూ.. ఐఐటీ మద్రాస్ అనేక అంశాల్లో దేశంలోనే నెంబర్‌వన్ అని అన్నారు. ఐఐటీ మద్రాస్ ఆన్‌లైన్ కోర్సులు అందిస్తోందని.. ఐఐటీ మద్రాస్ స్టార్టప్ అగ్నికల్ మంచి విజయాలు అందుకుందని చెప్పారు. ఇక్కడి స్టార్టప్‌లు 80 శాతం విజయవంతం అవుతున్నాయన్నారు. ఐఐటీ మద్రాస్‌లో దాదాపు 40 శాతం మంది తెలుగు విద్యార్థులే ఉన్నారని అన్నారు.ఐఐటీల స్థాపన దేశ విద్యారంగంలో గొప్ప అడుగు అని చెప్పుకొచ్చారు. ఆర్థిక సంస్కరణలు దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేశాయన్నారు. 1991 ఆర్థిక సంస్కరణలు ఎంపిక కాదు.. తప్పనిసరి అని అన్నారు. రాజకీయ సంస్కరణలతో సోవియట్ రష్యా అనేక దేశాలుగా విడిపోయిందన్నారు. అదే సమయంలో చైనా ఆర్థిక సంస్కరణలు ప్రారంభించిందని తెలిపారు. ఆర్థిక సంస్కరణల తర్వాత చైనా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని వెల్లడించారు. భారత్ కూడా ఆర్థిక సంస్కరణల తర్వాత అభివృద్ధి బాట పట్టిందని తెలిపారు. బ్రిటిష్ వారు దేశం నుంచి అంతా తీసుకెళ్లారని.. ఒక్క ఇంగ్లీష్ భాషను మనకు వదిలేశారన్నారు. 1990లలో కమ్యూనికేషన్ రంగం బీఎస్‌ఎన్‌ఎల్, వీఎస్‌ఎన్‌ఎల్ గుత్తాధిపత్యంగా ఉండేదన్నారు. సంస్కరణల తర్వాత కమ్యూనికేషన్ల రంగంలో ప్రైవేటు సంస్థలు వచ్చాయన్నారు. కమ్యూనికేషన్ల రంగంలో ప్రైవేట్ సంస్థల రాక ఓ గేమ్ ఛేంజర్ అని సీఎం తెలిపారు.
Latest News