![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 28, 2025, 03:45 PM
లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి అమెరికా పర్యటనకు సిద్ధమైనట్లు సమాచారం. రాహుల్ గాంధీ అమెరికా టూర్ గురించి అధికారిక సమాచారం బయటికి రానప్పటికీ హస్తం పార్టీ వర్గాలు మాత్రం చర్చించుకుంటున్నాయి. దీంతో ఈ విషయాలను నేషనల్ మీడియా వెల్లడించింది. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఏప్రిల్ 19 నుంచి అగ్రరాజ్యం అమెరికాలో పర్యటించనున్నారు. అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీని ఆయన సందర్శించనున్నారు. బోస్టన్‌లో ప్రవాస భారతీయులతో భేటీ అవుతారని సమాచారం. అయితే రాహుల్ గాంధీ పర్యటనపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Latest News