భూకంపంతో వణికిపోతున్న మయన్మార్, థాయిలాండ్
 

by Suryaa Desk | Fri, Mar 28, 2025, 06:14 PM

భూకంపంతో వణికిపోతున్న మయన్మార్, థాయిలాండ్

ఆగ్నేయాసియా దేశాలు మయన్మార్, థాయిలాండ్ నేడు భారీ భూకంపంతో వణికిపోయాయి. రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి భారీ భవనాలు సైతం నెలకొరిగాయి. మయన్మార్ లో ప్రాణనష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో కూలిపోయిన ఓ భవనం శిథిలాల్లో 43 మంది చిక్కుకుపోయినట్టు భావిస్తున్నారు. ఈ భూకంపంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. భూకంపంలో చిక్కుకున్న ప్రజలంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. సహాయ కార్యక్రమాల్లో అవసరమైన తోడ్పాటు అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని వెల్లడించారు. సహాయ చర్యలపై భూకంప బాధిత దేశాలను సంప్రదించాలని ప్రధాని మోదీ విదేశాంగ మంత్రిత్వ శాఖను ఆదేశించారు. కాగా, మయన్మార్ ను రెండు వరుస భూకంపాలు కుదిపేశాయి. 12 నిమిషాల వ్యవధిలో ఈ రెండు భూకంపాలు సంభవించినట్టు రికార్డయింది. మొదట వచ్చిన భూకంపం తీవ్రత 7.7 కాగా... రెండోసారి వచ్చిన భూకంపం తీవ్రత 6.4గా నమోదైంది. థాయిలాండ్ లో 7.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. అటు, బంగ్లాదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లోనూ 7.3 తీవ్రతతో భూప్రకంపనలు వచ్చినట్టు గుర్తించారు. భారత్ లోని పలు ప్రాంతాల్లోనూ మయన్మార్ భూకంప ప్రభావం కనిపించింది. కోల్ కతా, మేఘాలయా, ఇంఫాల్ లో ఓ మోస్తరు ప్రకంపనలు వచ్చాయి. మేఘాలయాలోని ఈస్ట్ గారో హిల్స్ లో 4.0 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి.

Latest News
India’s services sector activity remains buoyant in March Fri, Apr 04, 2025, 01:07 PM
ED raids multiple premises of 'Empuraan' producer Gokulam Gopalan Fri, Apr 04, 2025, 01:02 PM
Day of celebration for poor Muslims: JPC chief Pal hails passage of Waqf Bill Fri, Apr 04, 2025, 12:44 PM
Ultrasound-activated CAR T-cell therapy to enable long-lasting tumour destruction Fri, Apr 04, 2025, 12:34 PM
Molecular stool test shows promise for TB diagnosis in adults with HIV: Study Fri, Apr 04, 2025, 12:32 PM