![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 28, 2025, 06:18 PM
రాష్ట్రంలో వివిధ చోట్ల జరిగిన స్థానిక సంస్తల ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థులు వీరోచితంగా పోరాడి గెలిచారంటూ వైసీపీ అధినేత జగన్ ట్వీట్ చేశారు. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి పార్టీలకు ఎలాంటి బలం లేకపోయినా, చంద్రబాబు అహంకారాన్ని చూపి, పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసినా... కేసులు పెట్టినా, ఆస్తులు ధ్వంసం చేస్తామని, బంధువుల ఉద్యోగాలు తీసేస్తామని, జీవనోపాధి దెబ్బతీస్తామని భయపెట్టినా వైసీపీ కార్యకర్తలు వెనుకంజ వేయలేదని కొనియాడారు. ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా, వాటన్నింటినీ బేఖాతరు చేస్తూ మన పార్టీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ధైర్యంగా నిలబడి వైసీపీ అభ్యర్థులను గెలిపించుకున్నారని ప్రశంసించారు. "విలువలకు, విశ్వసనీయతకు పట్టం కడుతూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టిన వైసీపీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, నాయకులను చూసి గర్వపడుతున్నాను. కష్టసమయంలో వీళ్లు చూపించిన ధైర్యం పార్టీకి మరింత ఉత్తేజాన్ని ఇచ్చింది. ఈ ఎన్నికలను సమన్వయపరుస్తూ విజయానికి బాటలు వేసిన వివిధ నియోజకవర్గాల ఇన్చార్జిలు, జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, పార్టీ కేంద్ర కార్యాలయ సిబ్బంది అందరినీ అభినందిస్తున్నాను. వైసీపీకి అప్పడూ, ఇప్పుడూ, ఎల్లప్పుడూ వెన్నెముకలా నిలుస్తున్న కార్యకర్తలకు నా హ్యాట్సాఫ్" అంటూ జగన్ పేర్కొన్నారు.
Latest News