బ్యాంకాక్ ఎయిర్‌పోర్ట్ లాక్‌డౌన్... మయన్మార్‌లో కుప్పకూలిన 1000 పడకల ఆసుపత్రి
 

by Suryaa Desk | Fri, Mar 28, 2025, 08:00 PM

బ్యాంకాక్ ఎయిర్‌పోర్ట్ లాక్‌డౌన్... మయన్మార్‌లో కుప్పకూలిన 1000 పడకల ఆసుపత్రి

మయన్మార్‌‌ను శక్తివంతమైన భూకంపం కుదిపేసింది. పశ్చిమ మండేలాలో రిక్టర్ స్కేల్‌పై 7.7 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపంతో అనేక భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. ఇప్పటి వరకూ 20 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 50 మంది వరకూ గాయపడినట్టు అధికారులు తెలిపారు.భూకంపంతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్టు నివేదికలు అందుతున్నాయి. మయన్మార్ రాజధాని నెపిడాలోని 1000 పడకల ఆసుపత్రి భవనంం కుప్పకూలిపోయింది. దీంతో గాయపడినవారికి భవనం వెలుపల వీధుల్లోనే చికిత్స అందజేస్తున్నారు. బాధితులను కుటుంబసభ్యులు, ప్రియమైనవారు ఓదార్చుతున్న దృశ్యాలు గాయపడిన వారికి వీధుల్లో చికిత్స అందజేస్తున్నట్టు చూపిస్తున్నాయని అంతర్జాతీయ మీడియా ఏఎఫ్‌పీ తెలిపింది.


ఈ భవనానికి ఇంకా పేరు పెట్టలేదని తెలుస్తోంది. ఇక్కడే పెద్ద సంఖ్యలో బాధితులు ఉండే అవకాశం ఉంది. ఆప్తులు, ఆత్మీయులను కోల్పోయినవారు శిథిలాల కింద వారి కోసం వెతుకుతున్నారు. మండేలాలోని నివాస భవనాలు కూలిపోయాయి. ఇర్రవడ్డి నదిపై ఉన్న బ్రిటిష్ కాలం నాటి వంతెన, థాయిలాండ్ సరిహద్దులో ఉన్న ఒక మఠం కూడా ధ్వంసమైంది. సగైంగ్ పట్టణానికి 16 కి.మీ దూరంలో భూకంప కేంద్రం.. భూమికి 10 కి.మీ లోతులో ఉన్నట్టు గుర్తించారు.


మొత్తం మూడు సార్లు వరుసగా భూకంపం నమోదయ్యిది. తొలుత శుక్రవారం మధ్యాహ్నం 12.50 గంటలకు 7.7 తీవ్రతతో మొదటి భూకంపం.. ఆ తర్వాత కొద్ది సెకెన్లకే 6.4 తీవ్రతతో రెండోసారి.. మరికాసేపటికి 4.9 తీవ్రతతో మూడో భూకంపం చోటుచేసుకుంది.


అటు, థాయ్‌లాండ్‌లో భూకంపం పెను విధ్వంసం మిగిల్చింది. ఉత్తర థాయ్‌లాండ్‌లో చాలా ప్రాంతాల్లో భవనాలు నెలమట్టామయ్యాయి. రాజధాని బ్యాంకాక్‌లో మెట్రో, విమాన సర్వీసులు నిలిచిపోయాయి. థాయ్‌లాండ్ విమానాశ్రయాన్ని లాక్‌డౌన్ చేశారు. థాయ్ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రా దేశంలోనే అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. బ్యాంకాక్‌లో నిర్మాణంలోని ఉన్న 30 అంతస్తుల భవనం కూలిపోగా.. అందులో 43 మంది చిక్కుకున్నారు. ఈ భవనం కూలిపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ భవనాన్ని ప్రభుత్వ కార్యాలయాల కోసం నిర్మిస్తున్నట్టు స్థానిక అధికారులు తెలిపారు.


ఇక, మయన్మార్ సరిహద్దుల్లోని చైనా ప్రావిన్సుల్లోనూ భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. యువాన్ ప్రావిన్సుల్లో భూప్రకంపలు నమోదయ్యాయని, మయన్మార్‌లో 7.9 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించిందని చైనా భూకంపం నెట్‌వర్క్ కేంద్రం తెలిపింది. మయన్మార్ భూకంప ప్రభావం దాని సరిహద్లుల్లో ఉన్న భారతీయ రాష్ట్రాల్లో కూడా కనిపించింది. పశ్చిమ్ బెంగాల్‌ రాజధాని కలకత్తా నగరం, మణిపూర్‌లోని పలు ప్రాంతాలు, బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకా, చోట్టోగ్రామ్‌లోనూ ప్రకంపనలు నమోదయ్యాయి.

Latest News
Kiren Rijiju targets Mamata govt for refusing to implement Waqf Act Tue, Apr 22, 2025, 05:02 PM
Kalinga Super Cup: AFC CL Two qualification is a big motivation for Bengaluru FC, says coach Zaragoza Tue, Apr 22, 2025, 04:58 PM
WBSSC job case: Bengal education minister justifies non-publication of segregated list Tue, Apr 22, 2025, 04:56 PM
70 pc of E-com, tech startups intend to hire freshers in India with AI in mind: Report Tue, Apr 22, 2025, 04:51 PM
EC gives point-by-point rebuttal to Rahul's claims on Maharashtra poll percentage and electoral rolls Tue, Apr 22, 2025, 04:51 PM