జియోహాట్ స్టార్ కు వంద మిలియన్ల సబ్స్క్రై బర్ లు....
 

by Suryaa Desk | Fri, Mar 28, 2025, 09:33 PM

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే ఒక అద్భుతమైన విజయంలో భాగంగా జియోహాట్స్టార్ 100 మిలియన్ల సబ్స్క్రైబర్ల సంఖ్యను అధిగమించింది. భారతదేశంలోని విభిన్న ప్రేక్షకులను అర్థం చేసుకోవడంలో , వారికి సేవ చేయడంలో జియోహాట్స్టార్ యొక్క అచంచలమైన నిబద్ధతకు ఈ చారిత్రాత్మక ఘనత ఒక అద్భుతమైన నిదర్శనం. భారతదేశంలో స్ట్రీమింగ్ను విప్లవాత్మకంగా మారుస్తూ , ఎంపిక చేసిన కొద్దిమందికి ప్రీమియం సేవ గా అనే భావనను తొలగిస్తూ  లక్షలాది మందికి రోజువారీ జీవితంలో అంతర్భాగంగా  స్ట్రీమింగ్ ను మార్చింది. ప్రత్యేకమైన ఉచిత-వీక్షణ నమూనా ప్రతిపాదన, ఆలోచనాత్మక సబ్స్క్రిప్షన్ ధరల వ్యూహం మరియు ప్రముఖ టెలికాం ప్రదాతలతో  లోతైన భాగస్వామ్యాలు, లభ్యతను సర్వవ్యాప్తం చేయడంతో పాటుగా  కంటెంట్ను విస్తృతంగా ఎలా ఆస్వాదించాలో చూపుతో  జియోహాట్స్టార్ కొత్త ప్రమాణాలను నిర్దేశించింది. 


ఈ మైలురాయి గురించి జియోస్టార్,  డిజిటల్ - సీఈఓ , కిరణ్ మణి మాట్లాడుతూ, “ప్రపంచ స్థాయి వినోదం అందరికీ అందుబాటులో ఉండాలని మేము ఎల్లప్పుడూ నమ్ముతుంటాము. ఇప్పుడు 100 మిలియన్ల మంది సబ్స్క్రైబర్ల సంఖ్యను దాటడం ఆ నమ్మికకు  నిదర్శనం. ఈ మైలురాయి భారతదేశం యొక్క అపరిమిత సామర్థ్యాన్ని నొక్కి చెప్పడమే కాకుండా, అపూర్వమైన స్థాయిలో కేటగిరీ-ఫస్ట్ అనుభవాలను అందించాలనే  మా నిబద్ధతను మరింతగా వెల్లడిస్తోంది . మేము ఆవిష్కరణలు ,  విస్తరణను కొనసాగిస్తున్న వేళ , స్ట్రీమింగ్ యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దడం , అందరికి దానిని చేరువ చేయటం , బిలియన్ స్క్రీన్లకు అనంతమైన అవకాశాలను అందించటం పై మా దృష్టి కొనసాగుతుంది” అని అన్నారు.

Latest News
US forces seize 2nd oil tanker off coast of Venezuela Sun, Dec 21, 2025, 02:52 PM
Pakistan: Police vehicle targeted near Afghan refugee camp targeted in Khyber Pakhtunkhwa Sun, Dec 21, 2025, 02:44 PM
Would have got Jaiswal and Jitesh in place of Ishan and Washington, says Jaffer Sun, Dec 21, 2025, 02:36 PM
Sydney terror attack: Australia marks Day of Reflection for victims, orders intelligence review Sun, Dec 21, 2025, 01:43 PM
PM Modi interacts with Assam students aboard Brahmaputra cruise Sun, Dec 21, 2025, 01:37 PM