|
|
by Suryaa Desk | Sat, Mar 29, 2025, 07:41 AM
మయన్మార్ లో 7.7 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం విలయం సృష్టించింది. భారీ భవనాలు సైతం నేలమట్టం అయ్యాయి. మయన్మార్ లో పలు చోట్ల రోడ్లు బీటలు వారాయి. ఒక్కరోజులోనే మూడు వరుస భూకంపాలు ఈ చిన్న దేశాన్ని వణికించాయి. మయన్మార్ లో భూకంపం కారణంగా ఇప్పటివరకు 182 మంది మృతి చెందారు. భవనాల శిథిలాల్లో చిక్కుకుని 370 మంది గాయపడ్డారు. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. క్షేత్రస్థాయి పరిస్థితుల దృష్ట్యా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అటు, థాయిలాండ్, బంగ్లాదేశ్ లోనూ నేడు భూకంపాలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై వీటి తీవ్రత 7.3గా నమోదైంది.
Latest News