అమావాస్య రోజు చేయకూడనివి ఇవే...
 

by Suryaa Desk | Sat, Mar 29, 2025, 11:55 AM

నేడు అమావాస్య. ఈరోజు చేయకూడని పనులను పండితులు సూచిస్తున్నారు. చంద్రుడు, భూమి మరియు సూర్యుడు ఒకే సరళరేఖలో ఉన్నప్పుడు, భూమికి ఎదురుగా ఉన్న చంద్రుని వైపు చీకటిగా ఉంటుంది, దీనిని అమావాస్య అంటారు.సంస్కృతంలో "అమా" అంటే "కలసి" మరియు "వస్యా" అంటే "నివసించడానికి" లేదా "సహవాసం" అని అర్థం, అంటే చంద్రుడు లేని రోజు అని అర్థం. హిందూ సంప్రదాయంలో, అమావాస్య రోజున పూర్వీకులను లేదా పితృదేవతలను గౌరవించడం కోసం ప్రత్యేకమైన కార్యక్రమాలు చేస్తారు. అమావాస్య రోజున శుభకార్యాలు చేయకూడదని, వివాహం, గృహ ప్రవేశం వంటివి చేయకూడదని నమ్ముతారు. అమావాస్య రోజున దుష్టశక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని నమ్ముతారు.


అమావాస్య రోజు చేయకూడనివి ఇవే..అమావాస్య రోజున జుట్టు మరియు గోళ్లను కత్తిరించకూడదు. శుభకార్యాలు చేయకూడదు. అమావాస్య రోజున ప్రయాణాలు చేయకూడదు అని కూడా కొందరు నమ్ముతారు.అమావాస్య అంటే చంద్రడు కనపడని రోజు. ఎవరైనా లేదా ఏదైనా లేనప్పుడు, అలా లేకపోవడం వల్ల, వారి ఉనికి శక్తివంతమవుతుంది. మీ స్నేహితుడో లేక సన్నిహితులు ఎవరైనా మీతో ఉన్నప్పుడు, వారున్నట్లు అంతగా అనుభూతి చెందరు. చంద్రుడు లేని రోజు కూడా అలాగే ఉంటుందంటారు. భూమి, అమావాస్య రోజు విశ్రాంతి తీసుకుంటుంది. భూమిపై జీవ ప్రక్రియ నెమ్మదిస్తుంది. ఇది ఒక మంచి అవకాశం, ఎందుకంటే జీవం ఏకీకరణం ఈ రోజున బాగా జరుగుతుంది. ఎప్పుడైతే కొంత వేగం తగ్గుతుందో, అప్పుడే మీరు మీ శరీరాన్ని గమనిస్తారు. అంతా సవ్యంగా జరుగుతున్నప్పుడు, మీరు తీరిక లేకుండా ఉన్నప్పుడు, మీ శరీరానికి ఏమి జరుగుతుందో మీకు తెలీదు. కానీ, చిన్న వ్యాధి ఏదైనా వచ్చిందంటే, అకస్మాత్తుగా శరీరం ఒక సమస్యగా మారి, మీరు దాని పట్ల శ్రద్ధ వహించాల్సి వస్తుంది. ప్రాముఖ్యత ఏంటంటే? అమావాస్య రోజున, ఒక రకమైన పంచభూతాల ఏకీకరణం జరుగుతుంది. కావున అన్నీ కాస్త నెమ్మదిస్తాయి. మీరు శ్రేయస్సు కావాలనుకుంటే, పౌర్ణమి పవిత్రమైనది. మీరు మోక్షం కావాలనుకుంటే, అమావాస్య పవిత్రమైనదని చెబుతారు.స్త్రీ శక్తికి పౌర్ణమి అనుకూలమైనది. కావున, మహిళలు పౌర్ణమిని ఉపయోగించుకుంటారు. కానీ, మోక్షం కోరుకునే ఒక పురుషుడికి, పౌర్ణమి అంత మంచిది కాదు. అతడు ఒకవేళ శ్రేయస్సు కోరుకుంటే, పౌర్ణమిని ఉపయోగించుకోవచ్చు. కానీ, మోక్షం కోరుకుంటే మాత్రం అమావాస్య మంచిది. పూర్తిగా విముక్తి కోరుకునే వారందరికీ అమావాస్య అద్భుతమైందని పండితులు సూచిస్తున్నారు. మానసికంగా నిలకడలేని వారు, అమావాస్య లేదా పౌర్ణమి రోజున మరింతగా సమతుల్యం కోల్పోతారన్న సంగతి అందరికి తెలిసిన విషయమేనని పండితులు చెబుతున్నారు. చంద్రుని గురుత్వాకర్షణ శక్తి ద్వారా ఇలా జరుగుతుందంటున్నారు. కావున అమావాస్య రోజు మీరు సంతోషంగా ఉంటే, మరింత సంతోషంగా మారతారని, బాధగా ఉంటే, మరింత బాధపడతారని చెబుతారు. ఇందుకోసం అమావాస్య శనివారం రావడంతో అనుగ్రహ పూజలు కూడా అనేక మంది నిర్వహించడం పరిపాటిగా వస్తుంది.

Latest News
Hindus should unite to avoid situation like Bangladesh in India: Dhirendra Shastri Thu, Dec 25, 2025, 04:22 PM
Shubhanshu Shukla, NISAR mission take India to new heights in 2025; all eyes on Ganganyaan in 2026 Thu, Dec 25, 2025, 04:20 PM
There was more pressure last year than this year, says Rashid ahead of SA20 opener Thu, Dec 25, 2025, 04:16 PM
CCPA fines Vision IAS Rs 11 lakh for misleading UPSC result ads Thu, Dec 25, 2025, 04:14 PM
Constable shoots himself dead in Chhattisgarh Thu, Dec 25, 2025, 04:13 PM