కార్యకర్త గుర్తింపు కోసం ఇంటా, బయటా పోరాడతాన‌న్న లోకేశ్‌
 

by Suryaa Desk | Sat, Mar 29, 2025, 01:25 PM

పసుపు జెండా మనకు ఎమోషన్ 43 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో విజయాలు చూశాం. మరెన్నో సంక్షోభాలు ఎదుర్కొన్నాం. ఎన్ని కష్టాలు వచ్చినా ఎత్తిన పసుపు జెండా దించని కేడర్ మనకు మాత్రమే సొంతమని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో జరిగిన సభలో లోకేశ్‌మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఒక సంచలనం, మొదటి గెలుపు ఒక చరిత్ర. రాజకీయాల్లో రికార్డులు కొట్టాలన్నా, వాటిని తిరగరాయాలన్నా అది మనకే సాధ్యం. మూడు అక్షరాలు తెలుగు వారి ఆత్మగౌరవం కోసం తొడకొట్టాయి. ఆ మూడు అక్షరాలే తెలుగు ప్రజల గుండె చప్పుడుగా మారాయి. అవి మూడు అక్షరాలు కాదు ఒక ప్రభంజనం ఆ ప్రభంజనం పేరే ఎన్టీఆర్. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు 43 ఏళ్ల క్రితం తెలుగుదేశం పార్టీకి పునాది వేశారు. ఆ ముహూర్తబలం గొప్పది.. పునాది గట్టిది. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి తెలుగువాడి సత్తా ఏంటో ఢిల్లీకి తెలిసేలా చేసిన దమ్మున్న నాయకుడు అన్న ఎన్టీఆర్. 43 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం. ప్రత్యర్ధులు మీద పడుతున్నా మీసం మెలేసి తొడకొట్టిన అంజిరెడ్డి తాత లాంటి కార్యకర్తలు మన ధైర్యం. మెడ మీద కత్తి పెట్టి వాళ్ల నాయకుడి పేరు చెప్పమంటే జై టీడీపీ, జై చంద్రబాబు అంటూ ప్రాణాలొదిలిన చంద్రయ్య లాంటి కరుడుగట్టిన కార్యకర్తలు మన పౌరుషం. ప్రత్యర్థులు కత్తులతో దాడి చేసి రక్తమోడుతున్నా పోలింగ్ బూత్ నుంచి కదలని మంజుల లాంటి కార్యకర్తలు మన దమ్ము. 43 ఏళ్లుగా పార్టీకి, పసుపు జెండాకు కాపలా కాస్తున్న పసుపు సైన్యానికి నా పాదాభివందనం. సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లు అనే సిద్ధాంతంతో అన్న ఎన్టీఆర్ పార్టీని స్థాపించారు. పార్టీ ఆవిర్భావం నుంచి నేటివరకూ ఎన్నికష్టాలు ఎదురైనా అదే స్పూర్తితో పనిచేస్తున్నాం. దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది అన్న ఎన్టీఆర్... దేశానికి అభివృద్ధిని పరిచయం చేసింది మన పేదల పెన్నిధి చంద్రన్న. తెలుగువారి ఆత్మగౌరవం ఢిల్లీకి తెలిసేలా చేసింది అన్న ఎన్టీఆర్... తెలుగువారిని ప్రపంచపటంలో పెట్టింది చంద్రన్న. రూ.2 లకే కిలో బియ్యం, నిరుపేదలకు పక్కా ఇళ్లు, గురుకుల పాఠశాలలు, మహిళలకు ఆస్తిహక్కు, వృద్ధాప్య పింఛను లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు దేశానికి పరిచయం చేసింది టీడీపీ. చదువుకున్న యువతకు సీట్లు ఇచ్చింది టీడీపీ. పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేసింది టీడీపీ. బీసీలకు ఆర్థిక, రాజకీయ స్వాతంత్య్రం ఇచ్చింది టీడీపీ. కుల వివక్ష లేకుండా చేసింది టీడీపీ అని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. మనకి గల్లీ రాజ‌కీయాలు తెలుసు-ఢిల్లీ రాజ‌కీయాలు తెలుసు. జాతీయ రాజకీయాల్లోనూ సైకిల్ ముద్ర ఉంది. కేంద్ర ప్రభుత్వాలను శాసించే అవకాశం వచ్చినా ఎప్పుడూ స్వార్దానికి వాడుకోలేదు. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అని చెప్పిన ఏకైక పార్టీ టీడీపీ. అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి చేయడంలో మన కృషి ఉంది. జీఎంసీ బాలయోగి గారిని పార్లమెంట్ కు మొదటి దళిత స్పీకర్ చేసింది మనమే. అంబేద్కర్‌ గారికి భారతరత్న రావడంలో కీలకపాత్ర పోషించాం. హైవేల నిర్మాణం, విద్యుత్, టెలికం, ఐటీ రంగాలు, డిజిటల్ పేమెంట్స్ ఇలా అనేక సంస్కరణలు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాం. తెలుగు దేశం జెండా పీకేస్తాం అని ఎంతో మంది వచ్చారు. అలాంటి వారు అడ్ర‌స్‌ లేకుండా పోయార‌ని నారా లోకేశ్ అన్నారు. 2019 వరకూ మనం చూసిన రాజకీయం వేరు, 2019 నుంచి 2024 వరకూ మనం చూసిన రాజకీయం వేరు. అయిదేళ్లు గతంలో ఎన్నడూ చూడని అరాచక పాలనను మనం ఎదుర్కొన్నాం. మన దేవాలయంపై దాడి చేస్తే వెన్నుచూపకుండా ఎదురునిలబడ్డాం. మన అధినేత ఇంటికి తాళ్లు కడితే తాళ్లు తెంచుకొని పోరాడాం. క్లైమోర్ మైన్లకే భయపడని బ్లడ్ మనది. కామిడీ పీసులకు భయపడతామా? నలుగురు ఎమ్మెల్యేలను లాక్కొని ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తాం అన్నవారికి ప్రతిపక్ష హోదా లేకుండా ఇంటికి పంపాం. ప్యాలెస్ లు బద్దలు కొట్టాం. 2024 ఎన్నికల్లో మన స్ట్రయిక్ రేట్ 94 శాతం. 58 శాతం ఓట్ షేర్. 8 ఉమ్మడి జిల్లాలు క్లీన్ స్వీప్ చేశాం. మొన్న జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 65 శాతం ఓట్ షేర్ సాధించాం. ప్రజలు ప్రజా ప్రభుత్వం కావాలని కోరుకున్నారు. వారి ఆకాంక్ష మేరకే ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంద‌ని లోకేశ్ తెలిపారు. పేదరికం లేని సమాజమే తెలుగుదేశం పార్టీ లక్ష్యం. రూ.200 పెన్షను రెండు వేలు చేసింది మనమే. ఇప్పుడు నాలుగు వేల పెన్షన్ ఇస్తుంది మనమే. దివ్యాంగులకు రూ.6వేలు, పూర్తిగా మంచానికి పరిమితం అయిన వారికి రూ.15 వేలు ఇస్తున్నాం. దేశంలో అత్యధిక పెన్షన్ ఇస్తుంది మనమే. దీపం పథకం కింద ఉచితంగా సుమారుగా కోటి సిలిండర్లు అందజేశాం. 16,347 పోస్టులతో త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం. అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే మ్యానిఫెస్టోలో ఇచ్చిన 177 హామీల్లో పూర్తి స్థాయిలో అమలు చేసినవి 55, పాక్షికంగా అమలు చేసినవి 49 అంటే దాదాపు సగానికి పైగా హామీలు అమలయ్యాయి. మే నెలలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మత్స్యకారులకు రూ. 20 వేలు ఆర్థిక సాయం చేస్తాం. త్వరలోనే పీ4 కార్యక్రమం కూడా ప్రారంభం కాబోతుంద‌ని మంత్రి లోకేశ్ చెప్పారు. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తే అధినేత. ఈ మాట నేను ఊరికే అనడం లేదు. దేశంలో కార్యకర్తలకు గౌరవం ఇచ్చే ఒకే ఒక్క పార్టీ టీడీపీ. మంచి చేస్తే మెచ్చుకుంటారు. తప్పు చేస్తే తాట తీస్తారు. కోటి సభ్యత్వాలు అనేది ఒక ప్రాంతీయ పార్టీకి అసాధ్యమైన రికార్డు. దాన్ని మనం సాధించాం. కేవలం 83 రోజుల్లో కోటి సభ్యత్వాలు నమోదు చేశాం. ఏపీలో 1 కోటి 53 వేల 551 సభ్యత్వాలు, తెలంగాణాలో 1,78,041 సభ్యత్వాలు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మొత్తం 1 కోటి 2 లక్షల 35 వేల 857 సభ్యత్వాలు నమోదయ్యాయి. ప్రమాద బీమా రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాం. కార్యకర్తల సంక్షేమం కోసం ఇప్పటివరకు సుమారు రూ.140 కోట్లు ఖర్చు చేసింది టీడీపీ. కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇస్తాం. 2004లో ఫ్యాక్షన్ గొడవల్లో చనిపోయిన కార్యకర్తల పిల్లలను చదివించి ఉద్యోగాలకు వచ్చేవరకు నిలబడింది చంద్రబాబు. పాదయాత్రలో ఫ్యాక్షన్ బాధిత కుటుంబాలను కలిశా. ప్రస్తుతం వారు వివిధ కంపెనీల్లో ఉన్నతస్థాయికి చేరారు. దేశ చరిత్రలో ఏ పార్టీలో అది జరగలేదు. అలాంటి నాయకుడు అధ్యక్షుడిగా ఉండటం మన అదృష్టం. కార్యకర్తల కోసం నేను బయట ఎంత పోరాడతానో పార్టీలో కూడా అంతే పోరాడతాను. నా లక్ష్యం ఒక్కటే పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలు, నాయకులను గుర్తించడమే. గ్రామ స్థాయి నాయకుడు రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదగాలి అనేది నా కోరిక. పార్టీ ముందు ఒక ప్రతిపాదన ఉంచాను. రెండు టర్మ్ లు ఒక పదవి చేసిన తరువాత పైకి అయినా వెళ్లాలి లేదా ఒక టర్మ్ గ్యాప్ అయినా తీసుకోవాలి. ఇది జరిగితే పార్టీలో కదలిక వస్తుంది. జాతీయ ప్రధాన కార్యదర్శిగా 4వసారి పనిచేస్తున్నా. పార్టీలో ప్రక్షాళన నాతోనే మొదలు పెట్టండి. యువకులకు రాజకీయాల్లోకి రావాలనే కోరిక వస్తుంది. నా స్టయిల్ ఒక్కటే... సీనియర్లను గౌరవిస్తా... పనిచేసే జూనియర్లకు ప్రమోషన్ ఇస్తా. పార్టీ మరో నలభై ఏళ్లు బ్రతకాలి అంటే కొత్త రక్తం ఎక్కించాలి. దానికి అందరి సహకారం కావాలి. పనిచేసిన వారికే పదవి అనేది నా విధానం. నాయకుల చుట్టూ కాదు ప్రజల చుట్టూ తిరిగే వారికే పదవులు ఇస్తాం. పార్టీలో పూర్తి స్థాయి ప్రక్షాళన చేస్తాం. త్వరలోనే అన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తున్నామ‌ని లోకేశ్ తెలిపారు. ఇక ఎక్కడికి వెళ్లినా అందరూ రెడ్ బుక్, రెడ్ బుక్ అంటున్నారు. రెడ్ బుక్ గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. రెడ్ బుక్ పేరు చెప్పగానే కొంతమందికి గుండెపోటు వస్తుంది. కొంతమంది బాత్ రూంలో జారిపడి చేతులు విరగ్గొట్టుకుంటున్నారు. అర్దం అయ్యిందా రాజా. అధికారంలో ఉన్నాం అని గర్వం వద్దు, ఇగో వద్దు. అందరం కలిసి ప్రజల కోసం పనిచేద్దాం. ప్రజల ఆశీస్సులు ఉంటేనే మనం ఉంటామన్న విషయాన్ని కార్యకర్తలు గుర్తు పెట్టుకోవాలి. ప్రజల మనసు గెలిచేందుకు ప్రతి కార్యకర్త, నాయకుడు నిరంతరం శ్రమించాలని యువనేత నారా లోకేశ్‌ పేర్కొన్నారు.

Latest News
IANS Year Ender 2025: Inside India's final battle against Naxalism Sat, Dec 27, 2025, 04:29 PM
Very grateful, all credit to my team: Harmanpreet on becoming captain with most wins in women's T20Is Sat, Dec 27, 2025, 04:26 PM
Study finds risk-based approach better for breast cancer screening Sat, Dec 27, 2025, 04:24 PM
Rare earth manufacturing scheme to strengthen self-reliance for India's critical sectors Sat, Dec 27, 2025, 04:23 PM
Bangladesh: Tarique Rahman registers as voter, Awami League questions process Sat, Dec 27, 2025, 04:22 PM