ఛత్తీస్‌‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 3 నెలల్లో 100 మందికిపైగా మావోయిస్ట్‌లు మృతి
 

by Suryaa Desk | Sat, Mar 29, 2025, 07:51 PM

దండకారణ్యంలో మరోసారి భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో భద్రతా బలగాల ఎన్‌కౌంటర్‌లో 20 మంది మావోయిస్ట్‌లు మృతిచెందారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. శనివారం ఉదయం కెర్లపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గొగుండ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్ట్‌ల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు. డీఆర్జీ, సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టినట్టు పేర్కొన్నారు. కెర్లపాల్ సమీపంలో మావోయిస్ట్‌లు ఉన్నారనే సమాచారంతో శుక్రవారం రాత్రి భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి.


ఈ క్రమంలో ఎదురుపడిన నక్సల్స్.. భద్రతా బలగాలపై కాల్పులు ప్రారంభించారు. దీంతో అప్రమతమైన భద్రతా సిబ్బంది.. ఎదురుకాల్పులు జరపడంతో 15 మంది నక్సల్స్ హతమైనట్టు చెప్పారు. ఆ ప్రాంతంలో ఇంకా ఆపరేషన్ కొనసాగుతోందని, పూర్తి వివరాలు తర్వాత వెల్లడిస్తామని అన్నారు.


కాగా, ఎదురుకాల్పుల్లో ఇద్దరు జవాన్లు గాయపడినట్టు అధికారులు తెలిపారు. డీఆర్జీకి చెందిన ఈ జవాన్లను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్టు పేర్కొన్నారు. శనివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఎన్‌కౌంటర్ మొదలైనట్టు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ వెల్లడించారు. ఘటనా స్థలిలో 16 మంది మావోయిస్ట్‌ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని, ఇంకా ఆపరేషన్ కొనసాగుతోంది అని చెప్పారు. ఘటనా స్థలిలో భారీ ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాు. ఏకే-47 రైఫిల్స్, సెల్ఫ్-లోడింగ్ రైఫిల్, ఇన్సాస్ రైఫిల్, 303 రైఫిల్, రాకెట్ లాంఛర్లు, బ్యారెల్ గ్రనేడ్ లాంఛర్లు, పేలుడు పదార్థాలు ఇందులో ఉన్నాయని వివరించారు.


కాగా, ఈ ఏడాది మూడు నెలల్లోనే వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 130 మందికిపైగా మావోయిస్ట్‌లు మృతిచెందారు. ఒక్క బస్తర్ ప్రాంతం (బిజపుర సహా ఏడు జిల్లాలు)లోనే 116 మంది చనిపోయారు. గతవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 30 మంది వరకూ ప్రాణాలు కోల్పోయారు. వామపక్ష తీవ్రవాదాన్ని అంతం చేస్తామని శపథం చేసిన కేంద్రం.. ఇందుకోసం ఆపరేషన్ కగార్‌ చేపట్టింది. గతేడాది సార్వత్రిక ఎన్నికల తర్వాత ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్ట్‌ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని.. జరుపుతోన్న దాడుల్లో పదుల సంఖ్యలో మావోయిస్ట్‌లు మృతిచెందారు.


కాగా, బిజపుర-సుక్మా జిల్లాల సరిహద్దుల్లోని తుమ్రెల్లి అటవీ ప్రాంతంలో జనవరి చివరి వారంలో మావోయిస్ట్‌ల బంకర్‌ను గుర్తించారు. అందులో భారీ ఆయుధాలు, పేలుడు పదార్థాలను తయారు చేసే సామాగ్రి లభ్యమైంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భద్రతా సిబ్బందికి హాని కలిగించేలా సొరంగం లోపల బాంబులు తయారీకి నక్సలైట్లు గాజు సీసాలు ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. ఆయుధాలు తయారు చేసే మెషిన్లు, ఎలక్ట్రికల్ వైర్లు, బాటిల్ బాంబులను స్వాధీనం చేసుకున్నారు.


Latest News
Maha BJP MP's cryptic post on ticket distribution points to 'loyalists vs outsiders' row Thu, Jan 01, 2026, 02:53 PM
Rajnath Singh visits Bangladesh HC, offers condolences over Khaleda Zia's demise Thu, Jan 01, 2026, 02:44 PM
BJP calls Cong a 'liability' after Abhishek Banerjee's remarks on Oppn's poll defeats Thu, Jan 01, 2026, 02:43 PM
Commercial LPG price jumps by Rs 111 Thu, Jan 01, 2026, 02:38 PM
Afghanistan sees 2.8 million refugees return homeland in 2025 Thu, Jan 01, 2026, 02:29 PM