బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై సీఐడీ కేసు నమోదు
 

by Suryaa Desk | Sat, Mar 29, 2025, 08:09 PM

బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనాపై అక్కడి సీఐడీ కేసు నమోదు చేసింది. ముఖ్యంగా ఆ దేశ పోలీసులు ముందుగా.. మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తూ కేసులు పెట్టింది. ఒక్క షేక్ హసీనాపైనే కాకుండా మరో 72 మందిపై కూడా కేసులు నమోదు చేసింది. అయితే ఈ కుట్ర విషయంలోనే షేక్ హసీనాపై ఢాకా కోర్టులో మరో కేసు నమోదు కాగా విచారణ జరిపిన న్యాయస్థానం సీఐడీ దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో సీఐడీ కేసు నమోదు చేసింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.


రిజర్వేషన్ల కోటా విషయంలో గొడవలు చెలరేగగా 2024 ఆగస్టు నెలలో నిరసనకారులు ప్రధాని ప్యాలెస్‌ను చుట్టుముట్టారు. దీంతో 15 ఏళ్ల పాలనకు ముగింపు పలికిన షేక్ హసీనా ఆగస్టు 5వ తేదీన దేశం విడిచి పారిపోయారు. ముఖ్యంగా భారత దేశానికి వచ్చి ఇక్కడే ఆశ్రయం పొందుతోంది. షేక్ హసీనా పదవి వీడిన తర్వాత నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆయనే దేశాన్ని పాలిస్తున్నారు. కానీ షేక్ హసీనా తిరిగి అక్కడకు రప్పించేందుకు పెద్ద ఎత్తునే చర్యలు చేపడుతున్నారు. కానీ అవేవీ ఫలించడం లేదు.


అయితే ఇటీవలే షేక్ హసీనాకు అత్యంత సన్నిహితుడు, అమెరికా అవామీ లీగ్ ఉపాధ్యక్షుడు డాక్టర్ రబ్బీ ఆలం షాకింగ్ కామెంట్లు చేశారు. ముఖ్యంగా షేక్ హసీనాకు తిరిగి బంగ్లాదేశ్‌కు ప్రధాన మంత్రిగా వస్తున్నారని వివరించారు. అక్కడి యువతరం తప్పు చేసిందని.. అది వారు కావాలని చేసింది కాదంటూ వెల్లడించారు. మూడు, నాలుగు రోజుల క్రితమే బంగ్లాదేశ్ ప్రభుత్వం కూలిపోబోతుందని.. తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు చెలరేగే అవకాశం ఉన్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కానీ యూనస్ మాత్రం ఇవన్నీ అవాస్తవాలేనని తేల్చారు.


ఈక్రమంలోనే తాజాగా ఆ దేశ పోలీసులు షేక్ హసీనాతో పాటు మరో 72 మందిపై కేసులు నమోదు చేశారు. మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని సర్కారును గద్దె దించేందుకు వీరంతా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కుట్ర వ్యవహారంలో షేక్ హీసీనాపై ఢాకా మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో కేసు నమోదు కాగా.. సీఐడీ విచారణకు ఆదేశించింది. అయితే గతేడాది డిసెంబర్ 19వ తేదీన షేక్ హీసీనా ఆన్‌లైన్‌లో సమావేశాన్ని ఏర్పాటు చేసిందని.. జాబ్ బంగ్లా బ్రిగేడ్ పేరుతో వ్యవస్థను ఏర్పాటు చేసిందని సీఐడీ అధికారులు చెబుతున్నారు. చూడాలి మరి మున్ముందు ఏం జరగనుంది అనేది.

Latest News
England celebrate its players when they retire, India fall short in this regard: Panesar Fri, Jan 02, 2026, 04:49 PM
New PLI approvals to deepen value chains in components manufacturing: Industry Fri, Jan 02, 2026, 04:47 PM
Rights body worried about autonomy of lawyers, judicial independence in Pakistan Fri, Jan 02, 2026, 04:46 PM
BJP delegation meets Karnataka DGP over Ballari violence issue; seeks protection for party MLAs Fri, Jan 02, 2026, 04:37 PM
Encroachers' eviction row: KSHRC issues interim recommendations to Karnataka govt, GBA Fri, Jan 02, 2026, 04:32 PM