మయన్మార్‌‌లో భారీ భూకంపానికి కారణం ఇదేనా? ఏంటీ సగాయింగ్ ఫాల్ట్?
 

by Suryaa Desk | Sat, Mar 29, 2025, 09:49 PM

శుక్రవారం సంభవించిన భారీ భూకంపానికి మయన్మార్‌‌ను చిగురుటాకులా వణికిపోయింది. ప్రకృతి ప్రకోపానికి విలవిలలాడిపోయింది. పశ్చిమ మండేలాలోని సగైంగ్ రిక్టర్ స్కేల్‌పై 7.7 తీవ్రతతో చోటుచేసుకున్న తీవ్ర భూకంపం.. పెను నష్టాన్ని మిగిల్చింది. ఇప్పటి వరకూ 150 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా.. వందల మంది గాయపడ్డారు. అనేక మంది ఆచూకీ గల్లంతయ్యింది. శిథిలాల కింద వందలాది మంది చిక్కుకుపోయారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ భూకంప తీవ్రతకు ఎత్తైన భవనాలు, పురాతన కట్టడాలు, వంతెనలు కుప్పకూలిపోయాయి.


కాగా, ఈ భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతున సెంట్రల్ మయన్మార్‌‌లో ఉన్నట్లు గుర్తించారు. ‘సగాయింగ్‌ ఫాల్ట్‌’కు సమీపంలో ఉండే ఈ ప్రాంతంలో తరచూ భూకంపాలు సంభవిస్తున్నాయి. ఇంతకీ సగాయింగ్ ఫాల్ట్ అంటే ఏంటి? ఆ ప్రాంతంలోనే ఎందుకు భూకంపాలు సంభవిస్తాయి? దానికి గల కారణాలు ఏంటి? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. భూమి పైపొరల్లోని ఉండే అనేక ఫలకాల (టెక్టానిక్‌ ప్లేట్స్‌) సరిహద్దులను ఫాల్ట్స్‌ అంటారు. వీటి మందం కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. ఇవి నిరంతరం రాపిడికి గురవుతూ ఒకదానితో ఒకటి ఢీకొట్టుకుంటాయి. రెండు టెక్టానిక్ ప్లేట్ల మధ్య భాగమే సగాయింగ్ ఫాల్ట్ భారత్ టెక్టానిక్ ప్లేట్‌, మయన్మార్ మైక్రోప్లేట్‌ల మధ్య ఉండే సగాయింగ్‌ ఫాల్ట్‌ దాదాపు 1200 కి.మీల మేర విస్తరించింది.


టెక్టానిక్ ప్లేట్స్ నిరంతరం కదులుతూ ఉంటాయి. సగాయింగ్‌ ఫాల్ట్‌లో ఈ కదలికలు ఏడాదికి 11- 18 మిల్లీమీటర్ల వేగంతో జరుగుతున్నట్లు భూగర్భ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 18 మిల్లీమీటర్లు అంటే చాలా ఎక్కువని, ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుందని అంటున్నారు. సుదీర్ఘకాలం ఈ కదలికలు కొనసాగడం వల్ల అంచుల వద్ద రాపిడికి గురై ఘర్షణ పెరిగి ఒక్కసారిగా భూకంపానికి దారితీస్తుంది. అంచుల్లో ఒత్తిడి తీవ్రత ఎక్కువగా ఉంటే పగుళ్లు ఏర్పడతాయి. ఇక, భూకంప కేంద్రం లోతును బట్టి నష్టం ఉంటుంది. లోతు ఎంత తక్కువ ఉంటే.. నష్టం అంత భారీగా ఉంటుంది. టెక్టానిక్ ప్లేట్స్ వేగంగా ఒత్తిడికి గురికావడంతోనే మయన్మార్‌ ప్రాంతంలో తరచుగా భూకంపాలు సంభవిస్తున్నాయి.


సగాయింగ్‌ ఫాల్ట్‌ వల్లే అక్కడ అనేక భూకంపాలు చోటుచేసుకున్నాయి. భూకంపాల ముప్పు అధికంగా రెడ్‌ జోన్‌లో మయమ్మాన్ ఉంది. ఈ ప్రాంతంలో గడచిన వందేళ్లలో రిక్టర్ స్కేల్‌పై 6 తీవ్రత కంటే ఎక్కువగా 14 భూకంపాలు సంభవించినట్టు అంచనా. 1946లో 7.7 తీవ్రతతోనూ ఆ తర్వాత పదేళ్లలో 1956లో 7.1 తీవ్రతతోనూ భూకంపం వచ్చింది. 1988లో షాన్‌లో, 2004లో కోకో దీవిలో సంభవించిన శక్తివంతమైన భూకంపాలు వందలాది మందిని పొట్టనబెట్టుకున్నాయి. లో 2011 నాటి భూకంపంలో 151 మంది చనిపోయారు. ఆ తర్వాత 2016లో 6.9 తీవ్రతతో భూకంపం నమోదుకగా... ప్రస్తుతం 7.7 తీవ్రతతో సంభవించింది. మార్చి 28, 2025న కొద్ది నిమిషాల వ్యవధిలోనే వరుసగా ఆరు భూకంపాలు రావడంతో నష్టం భారీగా ఉంది.

Latest News
Revanth Reddy stalled Palamuru project to satisfy Chandrababu Naidu, alleges KTR Thu, Jan 08, 2026, 05:00 PM
Jagan accuses CM Chandrababu Naidu of 'betraying' people in Andhra Pradesh Thu, Jan 08, 2026, 04:56 PM
ED counters CM Mamata's claims on I-PAC raids, moves Calcutta HC Thu, Jan 08, 2026, 04:50 PM
Mongolia sees surge in measles cases Thu, Jan 08, 2026, 04:49 PM
Pakistan: Christians demand protection after another attack on church Thu, Jan 08, 2026, 04:48 PM