|
|
by Suryaa Desk | Sun, Mar 30, 2025, 09:52 AM
ఏపీలోని కూటమి ప్రభుత్వం శ్రీవిశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా 202 మందికి పురస్కారాలు ప్రకటించింది. ఇందులో కళారత్నకు 86 మందిని ఎంపిక చేయగా, 116 మందికి ఉగాది పురస్కారాలు ప్రకటించింది. ఈరోజు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే ఉగాది వేడుకల్లో ఈ అవార్డులను ప్రదానం చేయనుంది. సాహిత్యంలో కృత్తివెంటి శ్రీనివాసరావు, ఆచార్య శలాక రఘునాథశర్మ, గుత్తికొండ సుబ్బరావు తదితరులు... అవధానంలో అముదాల మురళి... సంగీతంలో ద్వారం లక్ష్మి, మల్లాది బ్రదర్స్... శిల్పాకళలో కాటూరి వెంకటేశ్వరరావు కళారత్న పురస్కారాలకు ఎంపికయ్యారు. అలాగే పాత్రికేయ విభాగంలో వేమూరి బలరాం, ఎం. నాగేశ్వరరావు, వల్లీశ్వర్ సహా పలువురికి కళారత్న అవార్డులు ప్రకటించింది. ఇక ఉగాది పురస్కారాలకు వేంపల్లె షరీఫ్, ఈతకోట సుబ్బారావు, కుప్పిలి పద్మ, డి. మధుసూదనరావు, అశ్విన్ కుమార్ తదితరులు ఎంపికయ్యారు.
Latest News