పుట్టిన పసికందులను ఉంచిన వార్డులో భయానక పరిస్థితి
 

by Suryaa Desk | Sun, Mar 30, 2025, 01:50 PM

మయన్మార్ ను అతలాకుతలం చేసిన పెను భూకంపం ప్రభావం చుట్టుపక్కల దేశాలపైనా పడింది. థాయ్ లాండ్ లోనూ భారీ నష్టం వాటిల్లగా.. పొరుగునే ఉన్న చైనాలోనూ భూమి కంపించింది. భూకంపం ధాటికి చైనాలోని ఓ ఆసుపత్రి తీవ్రంగా కంపించింది. ఆసుపత్రి భవనం ఊయల మాదిరిగా ఊగిపోయింది. దీంతో అప్పుడే జన్మించిన పసికందులను ఉంచిన వార్డులో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. పసికందులను ఉంచిన స్ట్రోలర్లు గదిలో చెల్లాచెదురయ్యాయి. దీంతో అక్కడే ఉన్న నర్సులు వెంటనే అప్రమత్తమయ్యారు. భవనం కూలిపోయే ప్రమాదం ఉన్నా వెరవకుండా పిల్లలను కాపాడటానికి ప్రయత్నించారు.రిగ్గా నిలబడలేని పరిస్థితిలో కూడా నర్సులు పిల్లల స్ట్రోలర్లు కదలకుండా పట్టుకున్నారు. ఓ నర్సు శిశువును ఎత్తుకుని, స్ట్రోలర్ లో ఉన్న మరో శిశువును కాపాడటానికి ప్రయత్నించడం, మరొక నర్సు నాలుగు స్ట్రోలర్లను పట్టుకుని నిలబడడం ఆసుపత్రిలోని సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయగా వైరల్ అయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ నర్సుల అంకిత భావానికి ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వీడియో తమను కదిలించిందని, మనుషుల్లో రాక్షసత్వం పెరిగిపోతున్న ఈ రోజుల్లో మానవత్వం ఇంకా మిగిలే ఉందని ఈ వీడియో చూస్తే తెలుస్తోందని కామెంట్లు పెడుతున్నారు

Latest News
Pongal shining symbol of richness of Tamil traditions: PM Modi in special letter to TN Wed, Jan 14, 2026, 11:30 AM
National Turmeric Board empowering farmers, promoting exports globally: Piyush Goyal Wed, Jan 14, 2026, 11:27 AM
Karnataka leadership tussle resurfaces as Dy CM Shivakumar shares cryptic post Wed, Jan 14, 2026, 11:25 AM
Sensex, Nifty open lower over FII outflows, crude prices rise Wed, Jan 14, 2026, 11:22 AM
US hosts APEC supply chain roundtable in Mexico City Wed, Jan 14, 2026, 11:21 AM