|
|
by Suryaa Desk | Sun, Mar 30, 2025, 03:48 PM
భారతదేశం లౌకికవాద దేశం. ఎక్కడో కొన్ని సంఘటనలు మినహాయిస్తే, మత సామరస్యానికి లోటు లేదు. ఏపీలో ప్రతి ఉగాది రోజున జరిగే ఈ క్రతువు కూడా మత సామరస్యానికి నిలువెత్తు నిదర్శనంలా నిలుస్తుంది. వైఎస్సార్ కడప జిల్లాలోని దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రతి ఉగాది పండుగ రోజున ముస్లింలు పూజలు చేస్తారు. ఇవాళ కూడా శ్రీ విశ్వావసు నామ ఉగాది సందర్భంగా ముస్లిం మహిళలు ఇక్కడి వెంకటేశ్వరస్వామి ఆలయానికి భారీగా తరలివచ్చారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక పురాణాల ప్రకారం వెంకటేశ్వరస్వామి ముస్లిం ఆడపడుచు అయిన బీబీ నాంచారమ్మను పెళ్లాడాడని చెప్పుకుంటారు. అందుకే, బీబీ నాంచారమ్మ తమ ఇంటి ఆడబిడ్డ అని, వెంకటేశ్వరస్వామి తమ ఇంటి అల్లుడు అని ముస్లింలు భావిస్తారు. ఈ నేపథ్యంలో, ప్రతి ఉగాది రోజున ముస్లింలు దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయానికి వచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తారు. ముస్లింలు తరతరాలుగా ఉగాది నాడు ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు
Latest News