షేన్ వార్న్ మరణంలో వెలుగులోకి కీలక సమాచారం
 

by Suryaa Desk | Mon, Mar 31, 2025, 10:20 AM

ప్రపంచ క్రికెట్ చరిత్రలో మేటి స్పిన్నర్‌గా వెలుగొందిన ఆస్ట్రేలియా లెగ్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ 52 ఏళ్ల వయస్సులో గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. 2022 ఏప్రిల్ లో థాయ్‌లాండ్‌లో ఉన్నప్పుడు వార్న్ మరణ వార్త వెలువడింది. అయితే, అతని మరణానికి గుండెపోటు కారణమని పేర్కొన్నప్పటికీ, కేసు దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒక భారతీయ ఔషధం వార్న్ మరణానికి కారణం కావచ్చని కేసు దర్యాప్తులో పాల్గొన్న ఒక అధికారి వెల్లడించారు. డైలీ మెయిల్ కథనం ప్రకారం, సంఘటన స్థలంలో ఒక పోలీసు అధికారి కామాగ్రా అనే ఔషధం సీసాను కనుగొన్నారు. ఇది అంగస్తంభన సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు ఉపయోగించే ఒక మందు. ఈ ఔషధంలో వయాగ్రాలో ఉన్నటువంటి పదార్థాలే ఉన్నప్పటికీ, గుండె సమస్యలు ఉన్నవారు దీనిని ఉపయోగించకూడదని తెలుస్తోంది. పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఒక పోలీసు అధికారి మాట్లాడుతూ, కొంతమంది సీనియర్ అధికారులు ఆ ఔషధాన్ని అక్కడి నుంచి తొలగించాలని ఆదేశించారని తెలిపారు. వార్న్ వంటి అంతర్జాతీయ వ్యక్తి మరణం గురించి ఇలాంటి వార్తలు బయటకు రాకూడదని వారు భావించడమే అందుకు కారణమని ఆ అధికారి పేర్కొన్నారు. "ఆ సీసాను తొలగించాలని మా సీనియర్లు మమ్మల్ని ఆదేశించారు. ఈ ఆదేశాలు పైనుంచి వచ్చాయి... అంతేకాదు. ఆస్ట్రేలియాకు చెందిన సీనియర్ అధికారులు కూడా ఈ మేరకు ఒత్తిడి తీసుకువచ్చి ఉంటారని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే వారి జాతీయ హీరోకు ఇలాంటి ముగింపు ఉండకూడదని వారు కోరుకున్నారు. అందుకే, అతను గుండెపోటుతో మరణించాడని అధికారిక నివేదిక వచ్చింది. కానీ ఆ గుండెపోటుకు దారితీసిన కారణాలు ఏమిటనే వివరాలు ఏమీ వెల్లడించలేదు. కామాగ్రా గురించి ఎవరూ ధృవీకరించడానికి ముందుకు రారు, ఎందుకంటే ఇది సున్నితమైన అంశం. దీని వెనుక చాలా శక్తివంతమైన అదృశ్య శక్తులు ఉన్నాయి. ఆ రోజు వార్న్ గదికి మేం వెళ్లగానే అక్కడ ఒక కామాగ్రా సీసా కనిపించింది. కానీ అతను ఎంత మోతాదులో ఆ మందు తీసుకున్నాడో మాకు తెలియదు. అక్కడ వాంతులు, రక్తం ఆనవాళ్లు కూడా ఉన్నాయి. కానీ మాకు అందిన ఆదేశాల మేరకు మేం అక్కడ్నించి కామాగ్రా బాటిల్ ను తొలగించాం" అని అధికారి తెలిపారు. 

Latest News
With Jaiswal’s coach by his side, Mokhade relishes run-making spree in Vijay Hazare Trophy Sat, Jan 17, 2026, 02:22 PM
The battle is not over: Shiv Sena (UBT) accuses Eknath Shinde of betraying Marathi people (Ld) Sat, Jan 17, 2026, 02:03 PM
Patna NEET aspirant death case: Autopsy report confirms sexual assault Sat, Jan 17, 2026, 01:48 PM
Since when has standing with someone in grief become politics: Cong says as Gandhi visits MP water contamination victims Sat, Jan 17, 2026, 01:45 PM
Will also get Punjab govt's FSL investigated by CBI: Delhi Assembly Speaker (Ld) Sat, Jan 17, 2026, 01:43 PM