|
|
by Suryaa Desk | Mon, Mar 31, 2025, 11:02 AM
మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైనాట్ 175 అని 11స్థానాలకు దిగజారిపోయారని.. మళ్లీ పోటీచేస్తే ఆ ఉన్న 11సీట్లు కూడా వైసీపీకి రావని విమర్శలు చేశారు. ఏపీలో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని ఉద్ఘాటించారు. జగన్ చేసిన అప్పుల దరిద్రమే ఈ పథకాల అమలుకు ఆలస్యం అవుతుందని చెప్పారు. ఎన్నో సంక్షేమ పథకాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందని ఉద్ఘాటించారు. భవిష్యత్ ఎన్నికల్లో అవినాష్‌ను ఎంపీగా, జగన్‌ను ఎమ్మెల్యేగా ఒడిస్తానని అన్నారు. జగన్‌కు స్కీంలు తెలియవు.. స్కాంలు మాత్రమే తెలుసునని ఆరోపించారు. జగన్, అవినాష్‌లు లోపలకు పోయే టైమ్ ఆసన్నమైందని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి హెచ్చరించారు.
Latest News