ఐదేళ్లలో ఒక్కసారి కూడా 180 ప్లస్ టార్గెట్‌ను CSK ఛేదించలేదు: సెహ్వాగ్
 

by Suryaa Desk | Mon, Mar 31, 2025, 05:55 PM

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐదేళ్లలో ఒక్కసారి కూడా 180 ప్లస్ టార్గెట్‌ను CSK ఛేదించలేదని భారత మాజీ క్రికెటర్ సెహ్వాగ్ పేర్కొన్నారు. 'రెండు ఓవర్లలో 40 పరుగులు చేయడం చాలా కష్టం. ఎంతటి పెద్ద ప్లేయర్‌ ఉన్నా సరే అంత తేలికేం కాదు. ఏదోఒకటి లేదా రెండు సందర్భాల్లోనే ఇలా జరుగుతుంది. ఇలాంటి ఫీట్లు ప్రతిసారీ జరగవు. గత ఐదేళ్లల్లో 180 పరుగులను మించిన లక్ష్యాన్ని ఛేదించలేదు' అని సెహ్వాగ్ అన్నారు.ఆదివారం రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. చివరి రెండు ఓవర్లలో 39 పరుగులు చేస్తే సీఎస్కే గెలవగలిగే పరిస్థితి ఉండేది. క్రీజులో ఇద్దరు అనుభవజ్ఞులైన ఆటగాళ్లు రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని ఉన్నారు. ధోని సిక్సర్లు బాది విజయం సాధిస్తాడని అభిమానులు ఆశించారు. 19వ ఓవర్లో సీఎస్కే 19 పరుగులు చేసింది. చివరి ఓవర్‌లో 20 పరుగులు చేస్తే సీఎస్కే గెలుస్తుంది. కానీ చివరి ఓవర్ తొలి బంతికే ధోనీ ఔటయ్యాడు. చివరి ఓవర్లో సీఎస్కే కేవలం 13 పరుగులు మాత్రమే చేసింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ 6 పరుగులతో తేడాతో ఓడిపోయింది.

Latest News
Govt committed to financially supporting startups, says Haryana CM Wed, Jan 21, 2026, 05:02 PM
Buddhist community says minorities in Bangladesh facing severe repression, violence Wed, Jan 21, 2026, 04:46 PM
India belongs to 1st group of AI nations, remains biggest supplier of services: Ashwini Vaishnaw Wed, Jan 21, 2026, 04:43 PM
Zomato parent Eternal clocks 73 pc rise in Q3 net profit as CEO departs Wed, Jan 21, 2026, 04:38 PM
IPL 2026: Dishant Yagnik appointed as Kolkata Knight Riders' fielding coach Wed, Jan 21, 2026, 04:36 PM