విమానాన్ని నడిపిన కేతిరెడ్డి
 

by Suryaa Desk | Mon, Mar 31, 2025, 08:58 PM

వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పైలెట్ అయ్యారు. ఆయన స్వయంగా విమానం నడిపారు. ఓ చిన్న ప్రైవేట్ జెట్ విమానాన్ని నడిపిన కేతిరెడ్డి హైదరాబాద్ గగన వీధుల్లో విహరించారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన తన సోషల్ మీడియా అకౌంట్ లో పంచుకున్నారు. తన కల సాకారమైందని, ఇప్పుడు తానొక సర్టిఫైడ్ పైలెట్ అని వెల్లడించారు. "ఆకాశం ఇక హద్దు కాదు... ఇది ప్రారంభం మాత్రమే. ప్రతి సవాలుకు, ప్రతి పాఠానికి, ఈ ప్రయాణంలో నాకు తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఇక మీదట అంతులేని సాహసాలే. ఒంటరిగా ఇదే నా తొలి గగన విహారం... అందుకు వింగ్స్ టీమ్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను" అంటూ కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ట్వీట్ చేశారు. ఈ మేరకు తన ఫస్ట్ ఫ్లయింగ్  వీడియోను కూడా పంచుకున్నారు.

Latest News
Chennai plans massive road relaying drive from Feb with Rs 200 cr sanction, contractors wary of funds Sat, Jan 24, 2026, 12:09 PM
Six killed in suicide bombing during wedding celebrations in Pakistan's KP Sat, Jan 24, 2026, 12:01 PM
Childhood vaccines do not raise risk of epilepsy: Study Sat, Jan 24, 2026, 11:42 AM
India's office market likely to outpace Asia‑Pacific peers with 7-10 pc rental growth Sat, Jan 24, 2026, 11:40 AM
Bangladesh: Awami League calls Feb referendum 'sham', accuses Yunus of deception Sat, Jan 24, 2026, 11:36 AM