|
|
by Suryaa Desk | Tue, Apr 01, 2025, 11:56 AM
పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్ల మండలం జూలకల్లులో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. నార్రెడ్డి వెంకటరెడ్డి అనే వైయస్ఆర్‌సీపీ కార్యకర్తపై కర్రలు, ఇనుప రాడ్లతో మూకుమ్మడి దాడి చేశారు టీడీపీ కార్యకర్తలు. ఈ దాడిలో వెంకటరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. వెంకటరెడ్డిని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. గ్రామంలో వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలు ఉండటానికి వీల్లేదంటూ టీడీపీ నాయకులు దాడి చేసినట్లు బాధితుడు వెంకటరెడ్డి పేర్కొన్నారు. టీడీపీకి చెందిన సామేలు, బత్తుల రాజేష్, చల్లా వీరయ్య వారి అనుచరులు దాడి చేసినట్లు బాధితుడు వెంకటరెడ్డి చెబుతున్నాడు. కాగా, కూటమి పాలనలో రెడ్ రాజ్యాంగం అంటూ వైయస్ఆర్‌సీపీ శ్రేణులపై దాడికి దిగుతున్నారు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజవర్గానికి చెందిన కురబ లింగమయ్యను దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. అధికార పార్టీ అన్యాయాలను ప్రశ్నించినందుకు.. వారి దాడులను వ్యతిరేకించినందుకు వైయస్ఆర్‌సీపీకి చెందిన కార్యకర్తలపై టీడీపీ దాడులకు దిగుతోంది అని వైసీపీ నేతలు వాపోతున్నారు.
Latest News