|
|
by Suryaa Desk | Tue, Dec 02, 2025, 07:52 PM
నెల్లూరు నగర మేయర్ పొట్లూరి స్రవంతిపై అవిశ్వాస తీర్మానానికి ముహూర్తం ఖరారైంది. డిసెంబర్ 18న అవిశ్వాసంపై ఓటింగ్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. కార్పొరేషన్‌లోని మెజారిటీ సభ్యులు తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది.నెల్లూరు కార్పొరేషన్‌లో మొత్తం 54 డివిజన్లు ఉన్నాయి. అయితే, ఇటీవల రాజకీయ సమీకరణాలు మారడంతో వీరిలో 40 మందికి పైగా కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. ప్రస్తుతం టీడీపీకి 42 మంది కార్పొరేటర్ల మద్దతు ఉంది. ఈ సంఖ్యా బలంతో, కొత్త మేయర్‌ను ఎన్నుకోవాలనే ఉద్దేశంతో కార్పొరేటర్లు ఇటీవల కలెక్టర్‌కు అవిశ్వాస తీర్మానం నోటీసులు అందజేశారు.ఈ నోటీసులను పరిశీలించిన కలెక్టర్, అవిశ్వాసం ప్రవేశపెట్టేందుకు తేదీని ఖరారు చేశారు. డిసెంబర్ 18న జరిగే ప్రత్యేక సమావేశంలో ఓటింగ్ నిర్వహించనున్నారు. ఈ ఓటింగ్‌తో ప్రస్తుత మేయర్ స్రవంతి భవితవ్యం తేలిపోనుంది. అనంతరం కొత్త మేయర్ ఎన్నికకు మార్గం సుగమం కానుంది.
Latest News