|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 12:44 PM
టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పల్నాడు జిల్లాలో వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై కట్టుకథలతో కేసులు పెట్టడం పరాకాష్టకు చేరింది అని మాజీ మంత్రి విడదల రజిని అన్నారు. ఆమె మాట్లాడుతూ... పిన్నెల్లి బ్రదర్స్‌కు ఏ మాత్రం సంబంధం లేని కేసుల్లో వారి పేర్లు పెట్టడం దారుణం. అసలు పల్నాడులో జంట హత్యలకు, పిన్నెల్లి బ్రదర్స్‌కు ఏమిటి సంబంధం? గుండ్లపాడు జంట హత్యలకు టీడీపీ గ్రూపుల మధ్య గొడవే కారణమని అందరికీ తెలుసు. అయినప్పటికీ అన్యాయంగా పిన్నెల్లి సోదరుల పేర్లు చేర్చి వేధిస్తున్నారు. చివరకు నాపైనా ఎన్నో కేసులు పెట్టారు. పోలీసులతో బెదిరింపులు, స్టేషన్ హాజరులు, అవమానాలు సరేసరి. అవన్నీ ప్రజలు చూస్తున్నారు. ఇప్పుడు చెబుతున్నాం. మా పార్టీ నాయకులు, కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న వారిలో ఎవ్వరినీ, రేపు మా ప్రభుత్వం వచ్చాక వదలి పెట్టబోం. వారికి కచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం. కాసు కుటుంబం రాష్ట్రానికి చేసిన సేవలు అందరికీ తెలిసినవే. వారి గౌరవాన్ని దెబ్బ తీయాలని చూస్తున్నారు. కానీ అవన్నీ విఫలమవుతాయి అని తెలిపారు.
Latest News