షుగర్ ఉన్నవారు బరువు తగ్గాలంటే బ్రేక్‌ఫాస్ట్, లంచ్‌లో ఏం తినాలి
 

by Suryaa Desk | Wed, Dec 03, 2025, 11:52 PM

మనం బరువు తగ్గాలనుకున్నప్పుడు ఎలా పడితే అలా ట్రై చేస్తే రిజల్ట్ ఉండదు. దానికంటూ ప్రత్యేకమైన డైట్ ఉంటుంది. అయితే, నార్మల్‌గా బరువు తగ్గాలనుకోవడం వేరు. షుగర్ ఉన్నవారు బరువు తగ్గాలనుకోవడం వేరు. అలాంటివారు ముందుగా కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. సరైన ఫుడ్స్ తీసుకోవాలి. అప్పుడే బరువు తగ్గడానికి హెల్ప్ అవుతుంది. రెగ్యులర్‌గా డైట్ చేసినట్లుగా కాకుండా, అలాంటి ఫుడ్స్ కాకుండా సరైన విధమైన డ్రింక్స్, ఫుడ్స్ తీసుకోవాలి. అలాంటి డైట్ గురించి న్యూట్రిషనిస్ట్ నేహా చెబుతున్నారు. మార్నింగ్ తీసుకునే డ్రింక్స్ నుండి రాత్రి వరకూ డిన్నర్ వరకూ ఎలాంటి ఫుడ్ తీసుకుంటే షుగర్ ఉన్నా త్వరగా బరువు తగ్గుతారో ఇప్పుడు చూద్దాం.


మార్నింగ్ డ్రింక్స్


బరువు తగ్గాలనుకునేవారు ఉదయాన్నే ఏదైనా ఒక డీటాక్స్ డ్రింక్ తాగితే అలాంటివాటిలో మీకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అవేంటంటే


మెంతుల నీరు : రాత్రి పడుకునే ముందు ఓ టీస్పూన్ మెంతుల్ని గ్లాసు నీటిలో నానబెట్టండి. ఇవి ఉదయాన్నే పరగడపున తాగితే మంచిది. లేదా


దాల్చిన చెక్క, గోరువెచ్చని నీరు : ఓ గ్లాసు నీటిలో దాల్చిన చెక్క పొడి వేసి మరిగించి తాగడం వల్ల కూడా మెటబాలిజం పెరిగేందుకు హెల్ప్ చేస్తుంది. బరువు తగ్గేలా చూస్తుంది. లేదా


ఉసిరి, అల్లం షాట్ : ఉసిరి రసం, అల్లం రసం కలిపి డ్రింక్‌లా తయారుచేసుకుని తాగండి. దీనిని తాగడం వల్ల జీర్ణ సమస్యలు దూరమవ్వడమే కాకుండా బరువు తగ్గడానికి కూడా హెల్ప్ అవుతుంది. లేదా


జీలకర్ర నీరు : అదే విధంగా, రాత్రుళ్ళు గ్లాసు నీటిలో టీస్పూన్ పరిమాణంలో జీలకర్రని నానబెట్టి ఉదయాన్నే వేడి చేసి గోరువెచ్చగా తాగండి. దీని వల్ల అరుగుదల బాగుంటుంది. బరువు కూడా తగ్గుతారు.


బ్రేక్‌ఫాస్ట్‌‌లో ఏం తినాలి?


​బ్రేక్‌ఫాస్ట్‌లో మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తినాలి. దీనికోసం


మూంగ్‌దాల్ చీలా, చట్నీ :


పెసరపప్పులో పుష్కలంగా ప్రోటీన్ ఉంటుంది. లేదా


వెజిటేబుల్ ఉప్మా :


ఎక్కువగా కూరగాయలు వేస్తే బాడీకి ఫైబర్ అందుతుంది. లేదా


గ్రీక్ యోగర్ట్, చియా సీడ్స్, నట్స్‌ కలిపి తీసుకోవచ్చు. లేదా


బేసన్ ఆమ్లెట్ స్టైల్ చీలా సలాడ్. ​


మిడ్ డే స్నాక్స్‌గా


స్మాల్ ఫ్రూట్ బౌల్: మీకు నచ్చిన పండ్లు, సీజనల్ ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. లేదా


కొబ్బరినీరు, నానబెట్టిన చియా సీడ్స్ కలిపి తీసుకోండి. లేదా


వేయించిన శనగలు కూడా తీసుకోవచ్చు. లేదా


మొలకల సలాడ్. లేదా


ఈ ఆప్షన్స్‌లో ఏవైనా తీసుకోవచ్చు.


లంచ్‌లో తినాల్సిన ఫుడ్


లంచ్‌లో తినాల్సిన ఫుడ్


1 రోటీ, పప్పు, 2 కప్పుల ఉడికించిన కూరగాయలు


లేదా


బ్రౌన్‌రైస్ అరకప్పు, రాజ్మా, సలాడ్


లేదా


వెజిటేబుల్ కిచిడి, పెరుగు


లేదా


క్వినోవా పులావ్ లేదా


దోసకాయ, టామాట సలాడ్


ఈవెనింగ్ స్నాక్


ఈవెనింగ్ స్నాక్


1 టీస్పూన్ నెయ్యిలో వేయించిన కప్పు మఖానా


లేదా


గ్రీన్ టీ, నట్స్


లేదా


వెజిటేబుల్ సూప్


లేదా


బాయిల్డ్ ఎగ్ లేదా పనీర్ క్యూబ్స్


షుగర్ ఉన్నవారు బరువు తగ్గాలంటే ఏం చేయాలి?


​డిన్నర్‌లో తినాల్సిన ఫుడ్స్


వెజిటేబుల్ సూప్, పనీర్


లేదా


స్టిర్ ఫ్రైడ్ వెజిస్, పప్పు


లేదా


మిల్లెట్ కిచిడి


లేదా


పనీర్ బుర్జీ, సాటెడ్ వెజ్జిస్


ఇలా ప్రతీ మీల్‌లోనూ ప్రోటీన్ ఉండేలా చూసుకోండి.

Latest News
TN: AITUC-affiliated agricultural labourers’ body opposes renaming of MGNREGA Sat, Dec 13, 2025, 04:42 PM
SMAT: 'No matter what, you have to give your best,' says Reddy after picking hat-trick Sat, Dec 13, 2025, 04:30 PM
TN Police arrest YouTuber 'Savukku' Shankar after long standoff Sat, Dec 13, 2025, 04:29 PM
Digital opportunities opening up for youth under PM Modi: Delhi CM Sat, Dec 13, 2025, 04:25 PM
PM Modi hails BJP's Thiruvananthapuram breakthrough as watershed moment in Kerala politics Sat, Dec 13, 2025, 04:20 PM