ఈ పత్రాలు ఉంటే,,,,శాలరీ స్లిప్ లేకుండానే పర్సనల్ లోన్
 

by Suryaa Desk | Fri, Dec 05, 2025, 11:14 PM

వ్యక్తిగత రుణం తీసుకోవాలంటే బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు మొట్ట మొదటిగా అడిగేది మీరు ఏ ఉద్యోగం చేస్తున్నారు, మీ శాలరీ స్లిప్ ఉందా? అని. వచ్చే వేతనం ఆధారంగానే ఏ గ్యారంటీ లేకుండా లోన్ ఇస్తారు. అయితే వ్యాపారం చేసే వారు, అద్దె ఆదాయం ఉన్నవారు, స్వయం ఉపాధి పొందుతున్న వారికి ఎలాంటి శాలరీ స్లిప్ ఉండదు. అయినా వాళ్లు కూడా పర్సనల్ లోన్ తీసుకోవచ్చు. మరి అది ఎలా అనే ప్రశ్న మీకు వచ్చే ఉంటుంది. కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు సమర్పించి లోన్ ఈజీగా పొందవచ్చు. స్థిరమైన ఆదాయం ఉందని బ్యాంకులకు నమ్మకం కలిగించాలి. మంచి క్రెడిట్ స్కోరు ఉండాలి. ఈ క్రమంలో శాలరీ స్లిప్ లేనివారు వ్యక్తి గత రుణం కోసం ఏయే డాక్యుమెంట్ల ఇవ్వాలో తెలుసుకుందాం.


ఈ డాక్యుమెంట్స్ ఇస్తే చాలు


గత 6 నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్స్, రెగ్యులర్ క్రెడిట్స్ సహా బ్యాంక్ ఖాతాలో బ్యాలెన్స్ చూపించాలి. మీకు ప్రతి నెలా డబ్బు క్రమంగా పెద్ద మొత్తంలో వస్తుందని తెలియజేయాలి. గత రెండేళ్లకు సంబంధించిన ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ (ITR) చూపించాలి. ఐటీఆర్ ఫైల్ చేసేవారికి లోన్ త్వరగా అందుతుంది. ఒకవేళ ఫార్మ్ 16 ఉంటే ఇవ్వాలి. బిజినెస్ చేసే వారు GST రిటర్న్స్ చూపించాల్సి ఉంటుంది. రెంట్ ఇన్‌ కమ్, ఇన్వెస్ట్‌మెంట్ ఇన్‌కమ్ పత్రాలు చూపించాలి. ఈ డాక్యుమెంట్లు ఇస్తే బ్యాంక్ స్థిరమైన ఆదాయం ఉందని నమ్ముతుంది. అయితే, డాక్యుమెంట్లతో పాటు క్రెడిట్ ప్రొఫైల్ బలంగా ఉందని చూపించాలి. క్రెడిట్ స్కోర్ 750కి పైగా ఎక్కువగా ఉన్నట్లయితే లోన్ ఈజీగా వస్తుంది. అలాగే డెట్ టు ఇన్‌కమ్ రేషియో తక్కువగా ఉండాలి.


డిజిటల్ లోన్స్ ఇచ్చే కంపెనీలు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, ప్రైవేట్ బ్యాంకులు ఈ రుణాలు ఇస్తుంటాయి. బ్యాంక్ స్టేట్‌మెంట్, క్రెడిట్ స్కోర్, క్యాష్ ఫ్లో చూసి రుణాలు ఇస్తాయి. లోన్ తీసుకునేముందు వడ్డీ రేటు, EMI, టెన్యూర్ చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. అయితే పర్సనల్ లోన్‌లో 5 రిస్కులు ఉంటాయి. ఇందులో వడ్డీ ఎక్కువగా ఉంటుంది. నెలవారీ EMI మిస్ అయినట్లియితే క్రెడిట్ స్కోర్ భారీగా పడిపోతుంది. ముందుగానే లోన్ క్లోజ్ చేయాలంటే పెనాల్టీ పడుతుంది. దీన్ని ప్రీ-క్లోజర్ ఛార్జెస్ అని పిలుస్తారు. EMI లు మిస్ అయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.

Latest News
India's textiles exports see 4.6 pc growth in last 4 fiscals, exports rise in over 100 nations Tue, Dec 16, 2025, 04:35 PM
IPL 2026 auction: Cameron Green to get Rs 18 crore despite KKR's Rs 25.2 Cr bid Tue, Dec 16, 2025, 04:34 PM
'Insult to Mahatma Gandhi': Oppn protests outside Parliament against move to replace MGNREGA Tue, Dec 16, 2025, 04:33 PM
Vibrant Gujarat Regional Conference: MoUs signed to accelerate Gir Somnath's industrial growth Tue, Dec 16, 2025, 04:04 PM
Victory Day: Sheikh Hasina's son warns of increasing Pak-backed proxies in Bangladesh Tue, Dec 16, 2025, 04:03 PM