వీళ్లు ఎండు కొబ్బరికి దూరంగా ఉంటేనే మేలు
 

by Suryaa Desk | Fri, Dec 05, 2025, 11:40 PM

కొబ్బరికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కొబ్బరి తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. కొబ్బరిని వంటల్లో ఉపయోగిస్తారు. ఇది వంటలకు రుచిని ఇవ్వడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అయితే, చాలా మంది వైద్యులు, ఆరోగ్య నిపుణులు తాజా కొబ్బరి, కొబ్బరి నీళ్లు తాగాలని సిఫార్స్ చేస్తారు. ఎందుకంటే తాజా కొబ్బరి, కొబ్బరి నీళ్లలో వివిధ రకాల విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. అయితే తాజా కొబ్బరితో పోలిస్తే ఎండిన కొబ్బరి పూర్తిగా భిన్నమైన పోషకాలు, ప్రభావాన్ని కలిగి ఉంటుంది. పచ్చి కొబ్బరితో పోలీస్తే చాలా మంది ఎండిన కొబ్బరిని వంటల్లో అనేక విధాలుగా ఉపయోగిస్తారు. ​ఎండు కొబ్బరిని తినడం వల్ల కూడా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే, కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఎండు కొబ్బరిని తినకూడదు. ఎండు కొబ్బరి ప్రయోజనాలు, ఎవరు తినకూడదో ఇప్పుడ తెలుసుకుందాం.


ఎండు కొబ్బరి ఆరోగ్య ప్రయోజనాలు


తరచుగా అలసట, బలహీనత సమస్యలతో బాధపడేవారికి ఎండు కొబ్బరి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఎండిన కొబ్బరిలో ఉండే కేలరీలు, రోగ్యకరమైన కొవ్వులు శక్తికి మంచి వనరులు. దీన్ని తీసుకోవడం వల్ల అలసట తగ్గుతుంది.


ఎండు కొబ్బరిలో ఉండే పోషకాలు రోగనిరోధక శక్తి పెంచడంలో సాయపడతాయి. ఎండు కొబ్బరిలో మంచి మొత్తంలో కాల్షియం, మెగ్నీషియం ఉంటాయి. ఇది ఎముకలను బలోపేతం చేయడంలో సాయపడుతుంది. అనేక ఆరోగ్య సమస్యల్ని దూరం చేస్తుంది. అయితే, కొందరు ఎండు కొబ్బరి తినకూడదు. వాళ్లు ఎవరంటే..


జీర్ణసమస్యలతో బాధపడేవారు


జీర్ణవ్యవస్థ సున్నితంగా ఉన్నవారు ఎండు కొబ్బరి తినే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయుర్వేదం ప్రకారం, ఎండిన కొబ్బరిని అధికంగా తీసుకోవడం వల్ల ఒక వ్యక్తి శరీరంలో పిత్త దోషం తీవ్రమవుతుంది. దీని వల్ల కడుపు నొప్పి, ఛాతీలో మంట, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా మలబద్ధకం కూడా తీవ్రమవుతుంది. అందుకే సున్నితమైన జీర్ణవ్యవస్థ, ఇరిటబుల్ బోవల్ సిండ్రోమ్‌తో బాధపడేవారు ఎండుకొబ్బరి తినే విషయంలో జాగ్రత్తగా ఉండాలి.


బరువు తగ్గాలనుకునేవారు


ఈ రోజుల్లో చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. దీంతో వీళ్లు బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారు. అయితే, బరువు తగ్గాలనుకునేవారు ఎండు కొబ్బరి తినే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఎండిన కొబ్బరిలో కేలరీలు, కొవ్వు ఉంటాయి. అందుకే ఎండు కొబ్బరి బరువు పెరగడానికి కారణమవుతుంది. మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంటే, ఎండు కొబ్బరిని ఎక్కువగా తినకండి. మితంగా తినండి. లేదంటే మానేయండి.


గుండె సమస్యలు ఉన్నవారు


ఎండిన కొబ్బరిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. కానీ దీన్ని పెద్ద పరిమాణంలో తీసుకోవడం వల్ల గుండె సమస్యలు ఉన్నవారికి హాని కలుగుతుంది. దీనిని మితంగా తీసుకోవాలి. గుండె సమస్యలతో బాధపడేవారు ఎండు కొబ్బరి తినే విషయంలో జాగ్రత్తగా ఉండండి. లేదంటే వైద్యుణ్ని సంప్రదించి తగిన సలహా తీసుకోండి.


షుగర్ లెవల్స్ పెరిగే ప్రమాదం


ఎండిన కొబ్బరిలో సహజ చక్కెరలు ఉన్నాయి. అందుకే డయాబెటిస్‌తో బాధపడేవారు ఎండు కొబ్బరి తినే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దానిని పెద్ద పరిమాణంలో తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. దీంతో, షుగర్ ఉన్నవారికి ఇబ్బంది కలుగుతుంది. అందుకే.. షుగర్ ఉన్నవారు మితంగా ఎండు కొబ్బరి తినాలి. ఎక్కువ తింటే మాత్రం హానికరం అంటున్నారు నిపుణులు.


గుర్తించుకోవాల్సిన విషయాలు


​ఏ ఆహారం అయినా మితంగా తినాలి. ఎక్కువగా తింటే ఆరోగ్యానికి ఇబ్బంది. ఎండు కొబ్బరి విషయంలో కూడా ఈ రూల్ వర్తిస్తుంది. ఎండు కొబ్బరిని కూడా తక్కువ పరిమాణంలో తినండి.


చిన్న పిల్లలు ఎండు కొబ్బరి తినే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెద్ద పెద్ద ముక్కలు వారి గొంతుకు అడ్డుపడే అవకాశం ఉంది.


దగ్గుతో బాధపడేవారు ఎండు కొబ్బరి తింటే ఎక్కువ అవుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అందుకే దగ్గుతో బాధపడేవారు ఎండు కొబ్బరి ఎక్కువ తినకండి.

Latest News
Congress stages protest in Karnataka over Herald case, hails court verdict Wed, Dec 17, 2025, 03:11 PM
Cutting debt-to-GDP ratio will be govt's core focus in coming fiscal: FM Sitharaman Wed, Dec 17, 2025, 03:08 PM
PM Modi lays wreath at Adwa Victory Monument in Ethiopia Wed, Dec 17, 2025, 02:56 PM
PM Modi receives rousing welcome at Ethiopian Parliament Wed, Dec 17, 2025, 02:49 PM
India and Ethiopia share warmth in climate and spirit: PM Modi Wed, Dec 17, 2025, 02:47 PM