ఒక తెల్ల వెంట్రుక పీకితే మిగతా జుట్టు కూడా తెల్లబడుతోందా
 

by Suryaa Desk | Fri, Dec 05, 2025, 11:44 PM

సాధారణంగా వయసు పైబడిన తర్వాత తెల్ల జుట్టు రావడం సాధారణం. అయితే, ఈ రోజుల్లో చాలా మంది చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్యను ఎదుర్కొంటున్నారు. నిండా ముప్పై నిండకముందే తెల్ల వెంట్రుకలతో సఫర్ అవుతున్నారు. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. అనారోగ్యకరమైన జీవనశైలి, తిండి అలవాట్లు, జీన్స్, మెలనిన్ తగ్గడం, ఎండలో ఎక్కువ సమయం గడపడం, రసాయన ఆధారిత ఉత్పత్తుల్ని జుట్టుపై ఎక్కువగా వాడటం వంటి కారణాలు అనేకం ఉన్నాయి. హార్మోన్ల అసమతుల్యత కూడా తెల్ల జుట్టుకు దోహదం చేస్తుంది.


అయితే, చాలా మంది ఒక విషయాన్ని ఎక్కువగా నమ్ముతారు. తెల్ల వెంట్రుక ఒకదాన్ని పీకితే.. మిగతా జుట్టు కూడా తెల్లబడుతోందని నమ్ముతారు. మన ఇంట్లోని పెద్దలు కూడా ఈ విషయాన్ని చెప్పడం మనం గమనించే ఉంటాం. నిజంగానే ఒక వెంట్రుక పీకడం వల్ల మిగతా జుట్టు తెల్లబడుతోందా, నిపుణులు ఏం అంటున్నారు ఇలా పూర్తి వివరాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


జుట్టు ఎందుకు తెల్లగా మారుతుంది?


నిజానికి, జుట్టుకు మెలనిన్ అనే వర్ణద్రవ్యం నుంచి రంగు వస్తుంది. ఒక వ్యక్తి వయసు పెరిగే కొద్దీ.. జుట్టులో మెలనిన్ ఉత్పత్తి తగ్గుతుంది. ఇది జుట్టు తెల్లబడటానికి దారితీస్తుంది. ఇంకా జీన్స్, ఒత్తిడి, పోషక లోపాలు, కొన్ని ఆరోగ్య పరిస్థితులు కూడా మెలనిన్ స్థాయిల్ని తగ్గించగలవు. దీనివల్ల జుట్టు బూడిద రంగులోకి మారుతుంది. అయితే, ఒక్క తెల్ల వెంట్రుక పీకితే.. మిగతాది కూడా తెల్లగా మారుతుందా లేదా అని ప్రముఖ డెర్మటాలజిస్ట్ అమ్నా అడెల్ చెప్పారు.


నిపుణులు ఏమంటున్నారు?


ఈ విషయంపై ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ అమ్నా అడెల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తన అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు. ఈ వీడియాలో డాక్టర్ అమ్నా అసలు విషయాన్ని చెప్పారు. తలలో వెంట్రుకల కుదుళ్లు ఉంటాయి. ప్రతి వెంట్రుక ఈ కుదుళ్లలో ఒకదాని నుంచి పెరుగుతుంది. కాబట్టి.. ఒక వెంట్రుకను పీకేస్తే.. అది ఇతర కుదుళ్లు లేదా ఇతర వెంట్రుకల్ని ప్రభావితం చేయదు. దీని అర్థం ఒక తెల్ల వెంట్రుకను తీయడం వల్ల మరొకటి తెల్లగా మారదు. అయితే, కుదుళ్ల నుంచి పీకిన వెంట్రుక మాత్రం తెల్లగా వస్తుంది.


డెర్మటాలజిస్ట్ ఏం అన్నారంటే


తెల్ల వెంట్రుకల్ని ఎందుకు పీకకూడదు?


తెల్ల వెంట్రుకల్ని పీకకూడదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే అది మీరు తీసే ఫోలికల్‌ను అంటే కుదుళ్లను దెబ్బతీస్తుంది. కొన్నిసార్లు చాలా లోతుగా ఉండటం వల్ల జుట్టు తిరిగి పెరగదు. అంతేకాకుండా తలపై చికాకు, ఎరుపు లేదా తీవ్రమైన సందర్భాల్లో ఇన్ఫెక్షన్ కూడా సంభవించవచ్చు. అందుకే ఒక వెంట్రుక పీకితే.. మిగతా జుట్టు తెల్లబడటం అనేది ఒక అపోహ మాత్రమే. ఇలాంటిదే ఇంకొక ప్రచారం కూడా ఉంది. తెల్ల జుట్టుకు రంగు వేస్తే మిగతాది కూడా బూడిద రంగులోకి మారుతుందని. దీనిపై కూడా వాస్తవం తెలుసుకోవాలి.


జుట్టుకు రంగు వేస్తే త్వరగా బూడిద రంగులోకి మారుతోందా?


జుట్టుకు ఒకసారి రంగు వేస్తే తెల్ల జుట్టు ఎక్కువ అవుతుందని చాలా మంది నమ్ముతారు. అయితే, ఈ నమ్మకం కూడా తప్పు అని నిపుణులు అంటున్నారు. జుట్టు కుదుళ్ల నుంచి బూడిద రంగులోకి మారుతుంది. మనం రంగు వేసినప్పుడు జుట్టుకు మాత్రమే వేస్తాం. సాధారణంగా మన జుట్టు కుదుళ్లు చాలా చిన్నవిగా ఉంటాయి. దీంతో, రంగు వాటిలోకి ఏం చొచ్చుకుపోదు. రసాయనాలు ఎక్కువగా ఉన్న డైలు వాడటం వల్ల జుట్టు పొడిగా, నిర్జీవంగా మారవచ్చు.


పోషకాహారం చేర్చుకోండి


జుట్టు తెల్లబడకుండా ఉండాలంటే ఆహారంలో కొన్ని పోషకాల్ని చేర్చుకోవాలి. ఆకుకూరల్ని తినడం మేలు చేస్తుంది. విటమిన్ బి6, విటమిన్ బి12, ఐరన్ వంటివి ఆకుకూరల్లో కనిపిస్తాయి. ఇవి ఎర్ర రక్తకణాల పెరుగుదలకు సాయపడతాయి. దీని కారణంగా తలకు మంచి రక్త ప్రసరణ ఉంటుంది. దీంతో.. జుట్టు నల్లగా ఉంటుంది. మాంసాహారులైతే సాల్మన్ చేప తినవచ్చు. ఇందులో సెలీనియం ఉంటుంది. ఇది హార్మోన్లను సమతుల్యం చేస్తుంది. ఈ హార్మోన్లు జుట్టు బూడిద రంగులోకి మారకుండా నిరోధిస్తాయి. అంతేకాకుండా విటమిన్ సి తీసుకోవడం వల్ల జుట్టు నల్లగా ఉంటుంది. ఆహారంలో ఉసిరి, స్ట్రాబెర్రీ, సిట్రస్ పండ్లను భాగం చేసుకోండి. వీటితో పాటు తృణధాన్యాలు, గింజలు, సీడ్స్ వంటి వాటిని భాగం చేసుకోండి.

Latest News
EAM Jaishankar meets Israeli PM Netanyahu, discusses deeper bilateral cooperation Wed, Dec 17, 2025, 11:34 AM
ED raids suspected hawala operator's house in Bengal's Hooghly Wed, Dec 17, 2025, 11:26 AM
US federal court upholds removal order against Indian national Wed, Dec 17, 2025, 11:20 AM
Rajasthan SIR: Over 61,000 names removed from CM's Sanganer Assembly seat Wed, Dec 17, 2025, 11:18 AM
MGNREGA renaming: Why remove Gandhi's name, asks SP's Ram Gopal Yadav Wed, Dec 17, 2025, 11:14 AM