|
|
by Suryaa Desk | Sat, Dec 06, 2025, 08:59 PM
మధ్యప్రదేశ్, సాగర్ నగరానికి చెందిన 67 ఏళ్ల మాజీ కౌన్సిలర్ నయీమ్ ఖాన్ శుక్రవారం తెల్లవారుజామున చనిపోయారు. కొన్ని వారాల క్రితమే ఆయన 25 సంవత్సరాల యువతిని రెండో వివాహం చేసుకున్నారు. పెళ్లైన కొద్ది రోజులకే ఆయన మృతి చెందడం అనేక అనుమానాలకు తావిస్తోంది. దీంతో కుటుంబ సభ్యులు విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. రెండు నెలల క్రితమే బీజేపీ ఆయనను పార్టీ నుంచి బహిష్కరించింది. ఆయన మృతి ఇటు కుటుంబంలోనూ.. అటు రాజకీయ వర్గాల్లో కూడా అనేక అనుమానాలను రేకేత్తిస్తుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొన్ని వారాల క్రితమే నయీమ్ ఖాన్.. పాతికేళ్ల యువతిని రెండో వివాహం చేసుకుని వార్తల్లో నిలిచారు. ఆయన పెళ్లి గురించి మర్చిపోక మందే.. శుక్రవారం తెల్లవారుజామున ఆయన చనిపోయారు. హఠాత్తుగా ఆయన ఆరోగ్యం పాడవ్వడంతో.. వెంటనే ఆస్పత్రికి తరలించారు. హస్పిటల్లో చేరిన కొద్దిసేపటికే నయీమ్ ఖాన్ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నయీమ్ ఖాన్ మృతదేహానికి పోస్ట్‌మార్టం చేయించి.. కేసును ద్యర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
అయితే చనిపోవడానికి కొన్ని రోజుల ముందు నుంచి నయీమ్ ఖాన్ జీవితం అనేక ఒడిదుడుకులకు గురైంది. రెండు నెలల క్రితమే ఓ యువతి నయీమ్ మీద తీవ్రమైన ఆరోపణలు చేసింది. దీంతో అతడిని ఆరేళ్ల పాటు బీజేపీ నుంచి బహిష్కరించారు. ఆ వెంటనే ఆయన పాతికేళ్ల యువతిని రెండో వివాహం చేసుకున్నాడు. అయితే ఇక్కడ ఓ ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. ఆయన రెండో వివాహం చేసుకున్న యువతి కూడా నయీమ్ మీద పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో.. ఆయనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ గొడవలన్నింటి కారణంగా ఆయన తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడని అతడి సన్నిహితులు చెబుతున్నారు.
నయీమ్ ఖాన్ సెప్టెంబర్‌లో రెండో వివాహం చేసుకున్న దగ్గర నుంచి ఆయన చాలా ఇబ్బంది పడుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. నయీమ్ ఖాన్‌కి, అతడి రెండో భార్యకు తరచుగా గొడవలు జరిగేవని వెల్లడించారు. ఈక్రమంలో శుక్రవారం ఉదయం నయీమ్ ఖాన్ అనారోగ్యం పాలయ్యాడని.. మాట్లాడటం లేదని తమకు ఫోన్ వచ్చిందని, తాము ఇంటికి వెళ్లి.. ఆయనను ఆస్పత్రికి తరలించామని.. ఆస్పత్రికి వెళ్లిన కాసేపటికే ఆయన చనిపోయారని తెలిపారు. ఈక్రమంలో కుటుంబ సభ్యులు నయీమ్ ఖాన్ మృతిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మరణించడానికి ముందు నయీమ్ ఖాన్ తన మొదటి భార్య కుటుంబానికి దూరంగా.. రెండో భార్యతో కలిసి శనిచారి ప్రాంతంలో ఓ ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఆయన మరణానికి ముందు జరిగిన గొడవలన్నిటినీ దృష్టిలో ఉంచుకుని, ప్రతి కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.
Latest News