బరువు తగ్గడమే కాకుండా బాడీలో పేరుకుపోయిన కొవ్వు ఇట్టే కరిగిపోతుంది
 

by Suryaa Desk | Mon, Dec 08, 2025, 11:07 PM

'బరువు తగ్గాలి.. నాజూగ్గా మారాలి..’ అని ఎంతోమంది కోరుకుంటారు. వెయిట్‌ లాస్‌ అవ్వడానికి చాలా మంది కడుపును మాడ్చుకుంటూ ఉంటారు. వారికి నచ్చిన ఆహార పదార్థాలకు దూరంగా ఉంటారు. జిమ్‌లో గంటల తరబడి కష్టపడుతూ ఉంటారు. అయితే, ఇదంతా అపోహ అని నిపుణులు అంటున్నారు. శరీరాన్ని శ్రమ పెట్టకుండా, మనకు ఇష్టమైన ఆహారాన్ని పూర్తిగా మానేయకుండా కూడా బరువు తగ్గడం సాధ్యం అని అంటున్నారు. ఆహారాన్ని తెలివిగా ఎంచుకోవడం, జీవనశైలిలో చిన్నచిన్న మార్పులు చేసుకుంటే మన టార్గెట్‌ రీచ్‌ కావొచ్చని నిపుణులు అంటున్నారు. సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్‌ ర్యాన్‌ ఫెర్నాండో జీరో బడ్జెట్‌ టాప్‌ డైట్‌ టిప్స్‌ను మనకు సూచించారు. అవేంటో ఈ స్టోరీలో చూసేద్దాం.


బ్రేక్‌ఫాస్ట్‌ కొంచెం ముందుకు జరపండి


మీరు లేచిన తర్వాత ఒకటి నుంచి రెండు గంటలలోపు బ్రేక్‌ఫాస్ట్‌ను తీసుకోండి. ఉదయం 6 నుంచి 10 గంటల మధ్య బ్రేక్‌ఫాస్ట్‌ తినండి. ఈ సమయంలో మీ జీవక్రియ అధికంగా ఉంటుంది. ఈ టైమ్‌లో తింటే బ్లడ్‌ షుగర్స్‌ కంట్రోల్‌లో ఉంటాయి, రోజు మొత్తం అతిగా తినకుండా నియంత్రణలో ఉంటారు, మీ సిర్కాడియమ్‌ రిథమ్‌ చక్కగా ఉంటుంది. ఈ బ్రేక్‌లో వ్యాయామం చేయమని సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్‌ ర్యాన్‌ ఫెర్నాండో సూచించారు. ఈ టైమ్‌లో గ్రీన్‌ టీ, హాట్‌ వాటర్‌ తాగండి. ఇవి శరీరంలో కొవ్వును కరిగిస్తాయని ఫెర్నాండ్‌ అన్నారు


మధ్యాహ్నం భోజనం ఇలా తినండి


lమధ్యాహ్నం భోజనంలో మీరు తీసుకునే పప్పు, కూర రెట్టింపు చేయండి డబుల్‌ చేయండి. అన్నం, చపాతీని సగానికి తగ్గించేయండి. ఇలా చేయడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. ప్రొటీన్‌, ఫైబర్, పోషకాల ఇన్‌టేక్‌ పెరుగుతుంది. కార్బోహైడ్రేట్స్‌ ఇన్పుట్‌ తగ్గుతుంది.


సూర్యాస్తమయం కంటే ముందు డిన్నర్‌ పూర్తి చేయండి


మీరు బరువు తగ్గాలనుకుంటే, సూర్యాస్తమయం కంటే ముందు డిన్నర్ తినేయాలని ఫెర్నాండ్‌ సూచించారు. రాత్రుళ్లు ఆలస్యంగా తినడం వల్ల అజీర్తి, గ్యాస్ట్రిక్‌.. వంటి జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ఈ అలవాటు బరువు పెరగడానికీ కారణమవుతుందంటున్నారు నిపుణులు. రాత్రి త్వరగా భోజనం చేసేస్తే, మీరు పడుకునేప్పటికి భోజనం అరిగిపోతుంది. క్యాలరీలు కూడా బర్న్‌ అవుతాయి.


ఈ టీలు తాగండి


డిన్నర్‌ తర్వాత పుదీనా, చామంతి టీ తాగండి. ఇవి మీ నిద్ర క్వాలిటీని మెరుగుపరుస్తాయి. మెటబాలిజమ్‌ను కూడా మెరుగుపరుస్తాయి. చమోమిలే టీలో ఉండే ఎపిజెనిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ నిద్రను ప్రేరేపించడంలో ఎంతో సహాయపడుతుంది. చామంతి టీ తాగడం వల్ల జీర్ణ ప్రక్రియ మెరుగుపడి ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. చామంతి టీ రోజూ తాగడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.

Latest News
Man shot at by bike-borne men in Patna outskirts Tue, Dec 30, 2025, 11:46 AM
Trump moves to shut asylum 'loophole': US media Tue, Dec 30, 2025, 11:43 AM
Trump sets hard line on Hamas, Iran at Netanyahu meet Tue, Dec 30, 2025, 11:39 AM
Indian national challenges US immigration detention Tue, Dec 30, 2025, 11:36 AM
MeT department predicts rain, snow in Kashmir from today Tue, Dec 30, 2025, 11:31 AM