|
|
by Suryaa Desk | Tue, Dec 09, 2025, 03:32 PM
AP: ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరంలో దారుణ ఘటన వెలుగు చూసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకటరత్నం సోమవారం హైదరాబాదులోని జవహర్ నగర్లో దారుణ హత్యకు గురయ్యారు. పిల్లలను పాఠశాలలో దింపి వస్తుండగా, ఆటోలో వెంబడించిన నలుగురు వ్యక్తులు కత్తులతో నరికి, బండ రాయితో మోది అతన్ని చంపేశారు. పాత కక్షలు, వ్యాపార వివాదాలే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Latest News