|
|
by Suryaa Desk | Tue, Dec 09, 2025, 04:29 PM
శతాబ్దాల నాటి వారసత్వ పుణ్యక్షేత్రం. బెంగళూరులోని ప్రసిద్ధ హలసూరు సోమేశ్వర స్వామి ఆలయం. ఇకపై ఈ గుడిలో వివాహాల నిర్వహణను నిషేధించారు. విడాకుల కేసుల్లో కోర్టులు పూజారులను, సాక్షులను తరచూ విచారణకు పిలవడం, కొందరు నకిలీ పత్రాలతో పెళ్లిళ్లు చేయించడం వంటి సమస్యలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. గతంలో సంవత్సరానికి 100–150 వరకూ పెళ్లిళ్లు జరిగిన ఈ పురాతన ఆలయం ఇప్పుడు పూర్తిగా వివాహాలకు నో చెప్పింది. తమ పెళ్లిని నిరాకరించారని ఒకరు సీఎంఓకి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది.
Latest News