|
|
by Suryaa Desk | Tue, Dec 09, 2025, 07:44 PM
ఎన్నికల కమిషన్ ను అడ్డం పెట్టుకుని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. మంగళవారం లోక్‌సభలో ఎన్నికల సంస్కరణలపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. ఈసీ స్వతంత్రతను దెబ్బతీస్తున్నారని, పక్షపాతంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తప్పు చేసినా శిక్ష పడకుండా చట్టాలను మార్చారని రాహుల్ విమర్శించారు. ఓట్ల దొంగతనంపై తాము ఎన్నో ఆధారాలు సమర్పించినా ఈసీ నుంచి కనీస స్పందన కరువైందని మండిపడ్డారు. బీజేపీకి అనుకూలంగానే ఎన్నికల షెడ్యూళ్లను ప్రకటిస్తున్నారని, పోలింగ్ ముగిసిన 45 రోజుల తర్వాత సీసీటీవీ ఫుటేజీని ధ్వంసం చేయాలనే నిబంధన ఎందుకని ఆయన ప్రశ్నించారు. హర్యానా ఓటర్ల జాబితాలో బ్రెజిల్‌కు చెందిన ఒక మోడల్‌కు 23 ఓట్లు ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఓటర్ల జాబితాలను ఎలా తారుమారు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చని అన్నారు
Latest News