|
|
by Suryaa Desk | Tue, Dec 09, 2025, 11:18 PM
దేశంలో జనాభా లెక్కల సేకరణ విధానం ఈసారి పూర్తిగా డిజిటల్‌గా మారనుంది. భారతదేశ చరిత్రలో తొలిసారిగా పేపర్ వాడకుండా, Digital Approach ద్వారా జనాభా వివరాలను సేకరించబోతోంది.ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఈ రోజు లోక్‌సభలో ప్రకటించారు.డిజిటల్ విధానంలో జనాభా లెక్కల సేకరణ కోసం కేంద్రం ఇప్పటికే రెండు మొబైల్ యాప్‌లు మరియు ఒక వెబ్ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో ఒక యాప్ జనగణకులకు, మరొకటి పౌరుల కోసం రూపొందించబడింది. గతంలో ఒక వ్యక్తి నుంచి సుమారు 30 ప్రశ్నలు అడిగి వివరాలు సేకరిస్తారు. కానీ ఇప్పుడు యాప్‌ల ద్వారా వివరాలను సులభంగా నమోదు చేయవచ్చు.పౌరులు తమ వివరాలను నేరుగా యాప్ ద్వారా నమోదు చేయవచ్చు. తరువాత, జనగణకులు ఇంటికి వచ్చి ఈ వివరాలను పరిశీలిస్తారు. ఈ విధానం ద్వారా జనగణన కోసం ఎక్కువ సమయం ఖర్చు కాకుండా, పని సులభతరం అవుతుంది.సాధారణంగా భారతదేశంలో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు సేకరించబడతాయి. చివరిసారి 2011లో జనగణన జరిగింది. కరోనా కారణంగా 2021లో జనగణన వాయిదా పడింది. ఇప్పుడు 2027లో కేంద్రం తాజా జనగణనకు సిద్దమవుతోంది.
Latest News