|
|
by Suryaa Desk | Wed, Dec 10, 2025, 10:41 AM
ఏపీలో ఖరీఫ్ 2025-26 ధాన్యం కొనుగోళ్లపై పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తాజా వివరాలు వెల్లడించారు. ఇప్పటివరకు 18.32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం 2,85,125 మంది రైతుల నుంచి సేకరించామని అన్నారు. రైతులకు 4,085.37 కోట్లు చెల్లించగా, మొత్తం కొనుగోలు విలువ 4,345.56 కోట్లు చేరిందన్నారు. గత ఏడాదితో పోలిస్తే ధాన్యం కొనుగోళ్లు 32.3%, రైతుల భాగస్వామ్యం 40.7%, కొనుగోలు విలువ 36.3% పెరిగాయని వెల్లడించారు. 2.67 లక్షల మంది రైతులకు చెల్లింపులు పూర్తయ్యాయని తెలిపారు.
Latest News