|
|
by Suryaa Desk | Wed, Dec 10, 2025, 07:23 PM
గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆగిపోయిన రోడ్ల నిర్మాణ పనులు రాప్తాడు నియోజకవర్గంలో ఇప్పుడు వేగంగా జరుగుతున్నాయి. బుధవారం కనగానపల్లి మండలంలో ఎమ్మెల్యే పరిటాల సునీత రంగంపేట నుంచి తగరకుంట వరకు 13.5 కిలోమీటర్ల రోడ్డు పనులను, తూముచర్లలో అత్యాధునిక వర్మీ కంపోస్ట్ యూనిట్‌ను, తగరకుంట నుంచి కట్టకింద తాండా వరకు 86 లక్షల ఉపాధి హామీ నిధులతో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. కూటమి ప్రభుత్వం వచ్చాకనే ఈ రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు, 6.40 కోట్ల ఏఐఐబీ నిధులతో బీటీ రోడ్డు, కల్వర్టుల నిర్మాణం జరుగుతోందని, ప్రస్తుతం 6 కిలోమీటర్ల బీటీ రోడ్డు పూర్తయిందని ఆమె తెలిపారు. గ్రామ పంచాయతీ ఆదాయం పెంచేందుకు వర్మీ కంపోస్ట్ యూనిట్‌లో మెరుగైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
Latest News