|
|
by Suryaa Desk | Wed, Dec 10, 2025, 10:04 PM
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నారు. టెస్ట్, టీ20లకు గుడ్‌బై చెప్పాక కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్న ఈ ఇద్దరు ప్లేయర్లు.. అగ్రస్థానం కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు. ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అయితే ఐసీసీ బుధవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ రెండో స్థానానికి చేరుకున్నారు. అగ్రస్థానంలో ఉన్న రోహిత్ శర్మకు మరింత చేరువయ్యాడు.
ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లీ విశేషంగా రాణించాడు. వింటేజ్ కోహ్లీని గుర్తు చేస్తూ.. పరుగుల వరద పారించాడు. తొలి రెండు వన్డేల్లో సెంచరీలు కొట్టిన అతడు.. మూడో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేశాడు. మొత్తంగా ఈ సిరీస్‌లో 3 మ్యాచ్‌లో 302 పరుగులు స్కోరు చేశాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు. ఫలితంగా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో కోహ్లీ ర్యాంక్‌ను గణనీయంగా మెరుగుపడింది.
ప్రస్తుతం నెంబర్ వన్ ప్లేస్‌ను చేరుకునేందుకు విరాట్ కోహ్లీ.. కేవలం ఎనిమిది రేటింగ్ పాయింట్ల దూరంలో ఉన్నాడు. ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న రోహిత్ శర్మ ఖాతాలో 781 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. రెండో స్థానంలో ఉన్న కోహ్లీ ఖాతాలో 773 పాయింట్లు ఉన్నాయి. విరాట్ కోహ్లీ ఏకంగా రెండు స్థానాలు ఎగబాకాడు. ఇక మూడో ప్లేసులో న్యూజిలాండ్‌కు చెందిన డేరిల్ మిచెల్ (766 పాయింట్లు), రెండో ప్లేసులో అప్ఘానిస్థాన్‌కు చెందిన ఇబ్రహీం జద్రాన్ (764 పాయింట్లు), మూడో ప్లేసులో టీమిండియా వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (723 పాయింట్లు) ఉన్నాడు. శ్రేయస్ అయ్యర్ ఒక ర్యాంక్ దిగజారి 10వ ప్లేసుకు పడిపోయాడు. కేఎల్ రాహుల్ 2 స్థానాలను మెరుగుపరుచుకొని 12వ స్థానానికి చేరాడు.
కాగా సౌతాఫ్రికాతో సిరీస్ కంటే ముందు భారత్.. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆడింది. ఆ సిరీస్‌లో అదిరే ప్రదర్శన చేసిన రోహిత్.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. తాజా సిరీస్‌లో కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకోవడం గమనార్హం. దీంతో రో-కోల మధ్య ఐసీసీ నంబర్ వన్ ర్యాంక్ కోసం పోటీ నెలకొంది.
Latest News