|
|
by Suryaa Desk | Thu, Dec 11, 2025, 11:55 AM
కాకినాడ జిల్లా పిఠాపురంలో బుధవారం అర్థరాత్రి ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సు సునీతపై దుండగులు కత్తితో దాడి చేశారు. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా బైక్‌పై వచ్చిన ఆగంతుకులు దాడి చేయగా, ఆమె కేకలు వేయడంతో పరారయ్యారు. సునీత శరీరంపై పలు చోట్ల గాయాలయ్యాయి. స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ప్రాణాపాయం లేదని తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, బంగారం చోరీ కోసమా లేక వ్యక్తిగత విభేదాలా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Latest News