|
|
by Suryaa Desk | Thu, Dec 11, 2025, 12:04 PM
చంద్రబాబు చెప్పిందల్లా చేయడమే పవన్ కళ్యాణ్ నమ్ముకున్న సిద్ధాంతమని, తనకు కావాల్సిందల్లా చంద్రబాబు నుంచి తీసుకుంటూ ఆయన ఆదేశించినప్పుడల్లా వైయస్ జగన్ గారిని తిట్టడానికి పవన్ కళ్యాణ్ తయారవుతున్నాడని గుంటూరు జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులోని తన క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తన బుర్రను స్విచ్చాఫ్ చేసుకున్నాడని, అందుకే ఎప్పుడేం మాట్లాడతాడో ఆయనకే క్లారిటీ ఉండటం లేదన్నారు. తీవ్రమైన పొలిటికల్ దారిద్ర్యంలోకి పడిపోయిన పవన్.., లోకేష్ కన్నా ఇమ్మెచ్యూర్డ్ పొలిటీషియన్ అనిపించుకుంటున్నాడనని వివరించారు. చంద్రబాబు నుంచి పుచ్చుకుంటున్నాడు కాబట్టే ఆయన అసమర్థ, అనైతిక విధానాలపై పవన్ కి నోరు పెగలడం లేదని ఎద్దేవా చేశారు. పార్టీ పెట్టిన నాటి నుంచి మూడు ఎన్నికలొస్తే మూడు సిద్దాంతాలు చెప్పిన పవన్ కళ్యాణ్ అంతిమ సిద్ధాంతం మాత్రం చంద్రబాబుకి చెంచాగిరీ చేయడమేనని దుయ్యబట్టాడు.
Latest News