|
|
by Suryaa Desk | Thu, Dec 11, 2025, 02:21 PM
ప్రకాశం జిల్లా గిద్దలూరు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత పిడతల రామ భూపాల్ రెడ్డి (89) కన్నుమూశారు. గత కొంతకాలంగా వయో సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు.రామ భూపాల్ రెడ్డి 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా గిద్దలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత నుంచి ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఆయన మరణవార్త తెలియగానే తెలుగు రాష్ట్రాల్లోని పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన అంత్యక్రియలు శుక్రవారం గిద్దలూరులో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
Latest News