|
|
by Suryaa Desk | Fri, Dec 12, 2025, 10:37 AM
విజయవాడ కనకదుర్గ ఆలయంలో భవానీ మాల విరమణకు వచ్చిన భక్తుల నుండి కొబ్బరికాయ కొట్టడానికి రూ.10 వసూలు చేస్తున్నారు. కొబ్బరికాయ కొట్టి, తీర్థం ఇచ్చిన వెంటనే 'అమ్మవారి కానుక' పేరుతో డబ్బులు అడగడంపై భక్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పుణ్యం కోసం కొబ్బరికాయ కొట్టాలనుకుంటే, దానికి డబ్బులు తీసుకోవడం ఏంటని నివ్వెరపోతున్నారు. ఈ వ్యవహారంపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Latest News