|
|
by Suryaa Desk | Fri, Dec 12, 2025, 12:31 PM
రాష్ట్రంలోని పలు స్థానిక సంస్థలకు జరిగిన ఉప ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీ హవాను చాటింది. అధికార కూటమి పార్టీ ప్రయత్నాలు బెడిసికొట్టాయి. గురువారం జరిగిన ఉప ఎన్నికల్లో కడప మేయర్‌తో పాటు 4 ఎంపీపీ స్థానాలను వైయస్ఆర్‌సీపీ కైవసం చేసుకుంది. అలాగే రెండు మండలాల్లో ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రెండింటినీ వైయస్ఆర్‌సీపీ గెల్చుకోవడం విశేషం. బాపట్ల జిల్లా వేమూరు, నంద్యాల జిల్లా దొర్నిపాడు, విజయనగరం జిల్లా మెరకముడియం, బొందపల్లి కోఆప్షన్ స్థానాలను వైఎస్సార్‌సీపీ గెల్చుకుంది. వరదాయపాలెం ఎంపీపీ ఎన్నిక కోర్టు స్టే కారణంగా వాయిదా పడింది. టీడీపీ కేవలం కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ పదవితో సరిపెట్టుకుంది.
Latest News