|
|
by Suryaa Desk | Fri, Dec 12, 2025, 01:28 PM
విశాఖ నగరంలో అంతర్జాతీయ టెక్నాలజీ సంస్థ కాగ్నిజెంట్ తన తాత్కాలిక క్యాంపస్‌ను ఇక్కడ ప్రారంభించింది. మధురవాడ హిల్ నెం-2లోని మహతి ఫిన్‌టెక్ భవనంలో వెయ్యి సీట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయాన్ని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు.కాగ్నిజెంట్ సంస్థ తన శాశ్వత క్యాంపస్ నిర్మాణం పూర్తి చేసే వరకు ఈ తాత్కాలిక కేంద్రం నుంచే కార్యకలాపాలను కొనసాగించనుంది. ఈ కేంద్రం ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజినీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్ వంటి అత్యాధునిక సాంకేతిక సేవలపై దృష్టి సారించనుంది. కార్యక్రమానికి ముందు మంత్రి లోకేశ్‌కు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన రిబ్బన్ కట్ చేసి, జ్యోతి ప్రజ్వలన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
Latest News