|
|
by Suryaa Desk | Fri, Dec 12, 2025, 01:38 PM
AP: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. SMలో తన వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘించేలా వ్యవహరిస్తున్నారని అంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పోస్టుల కారణంగా పవన్ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుందని పేర్కొంటూ ఆయన తరఫు లాయర్ పిటిషన్ దాఖలు చేశారు. వారం రోజుల్లో ఉల్లంఘనకు సంబంధించిన వివరాలను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని మెటా, గూగుల్, ఆయా SM ఫ్లాట్ ఫాంలను ఆదేశించింది. తదుపరి విచారణ DEC 22కు వాయిదా వేసింది.
Latest News