|
|
by Suryaa Desk | Fri, Dec 12, 2025, 03:19 PM
సింగపూర్‌లో మృతిచెందిన గాయకుడు జుబీన్ గార్గ్ కేసులో అస్సాం పోలీసులు న్యాయస్థానంలో 3,500 పేజీల ఛార్జిషీటు దాఖలు చేశారు. సిట్ దర్యాప్తులో భాగంగా 300 మందికి పైగా వ్యక్తులను విచారించి, ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు పేర్కొంది. మేనేజర్, నిర్వాహకుడు, గాయని, సంగీతకారుడు, కజీన్, పీఎస్‌వోలు నిందితులుగా ఉన్నారు. సెప్టెంబర్ 19న సింగపూర్‌లో సముద్రంలో ఈత కొడుతూ మృతిచెందిన జుబీన్ గార్గ్ హత్యకు గురయ్యారని ముఖ్యమంత్రి హిమంత్ శర్మ అసెంబ్లీలో వెల్లడించారు. ఈ కేసులో 60కి పైగా ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి.
Latest News