|
|
by Suryaa Desk | Fri, Dec 12, 2025, 07:54 PM
జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ఈ నెల 15న గుడివాడ ముగ్గుబజార్ సెంటర్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జేసీ నవీన్ తెలిపారు. వెనిగండ్ల ఫౌండేషన్, రెడ్సన్ ఫౌండేషన్, ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ సంయుక్త ఆధ్వర్యంలో ఉదయం 9 గంటలకు ఈ మేళా ప్రారంభం కానుంది. పదో తరగతి నుంచి బీఫార్మసీ వరకు విద్యార్హతలు కలిగి, 18-35 ఏళ్లలోపు ఉన్న నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
Latest News