|
|
by Suryaa Desk | Fri, Dec 12, 2025, 08:16 PM
రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ఆదేశాల మేరకు శుక్రవారం వీఎన్ఆర్ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి సంజీవరావు మాట్లాడుతూ, 36 కంపెనీల ద్వారా 860 ఉద్యోగావకాశాలు కల్పించినట్లు తెలిపారు. యువత తమ మంచి భవిష్యత్తు కోసం ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ధూళిపాళ్ల, కమిషనర్ ముప్పాళ్ళ రమేష్ బాబు సూచించారు.
Latest News