|
|
by Suryaa Desk | Sat, Dec 13, 2025, 08:19 PM
గోవాలోని 'బిర్చ్ బై రోమియో లేన్' నైట్‌క్లబ్‌లో గత వారం జరిగిన అగ్ని ప్రమాదంలో.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఢిల్లీ పర్యాటకుల్లో ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యంగా భావనా జోషి అనే మహిళ బయటపడగా.. అధికారులు క్లబ్ యాజమాన్యం, అధికారుల నిర్లక్ష్యంపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ ప్రమాదంలో ఆమె తన భర్త వినోద్ కుమార్, ముగ్గురు సోదరీమణులు (అనిత, సరోజ్, కమ్ల)ను కోల్పోయారు.
40 ఏళ్ల భావనా జోషి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నైట్‌క్లబ్ సిబ్బంది ప్రజలను తరలించడానికి బదులుగా తమ సామగ్రిని, అగ్నిప్రమాదం జరిగినప్పుడు ప్రదర్శన ఇస్తున్న డ్యాన్సర్‌ను కాపాడటానికి ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపించారు. "ప్రజలను తరలించే ప్రక్రియ క్రమపద్ధతిలో లేదు. ఒక తలుపు తెరవలేదు" అని ఆమె తెలిపారు. సరైన తరలింపుకు తగిన సమయం లేదా స్థలం లేకపోవడమే కాకుండా అగ్నిమాపక దళం ఘటనా స్థలానికి చేరుకోవడానికి 30 నుంచి 40 నిమిషాలు పట్టిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
యాజమాన్యం నిర్లక్ష్యంపై రెడ్ ఫ్లాగ్స్
ఆ క్లబ్ గతంలో కూడా అతిథులను సరిగా చూసుకోలేదని జోషి ఆరోపించారు. "క్లబ్‌లో సామర్థ్యం కంటే ఎక్కువ మందిని అనుమతిస్తున్నారనే ఫిర్యాదులు ఇంతకుముందే ఉన్నాయి. ఈ సంఘటనలు ఉన్నా అధికారులు ఎందుకు చర్య తీసుకోలేకపోయారు?" అని ఆమె ప్రశ్నించారు. ఈ ప్రమాదానికి కారణమైన క్లబ్ యజమానులు సౌరభ్, గౌరవ్ లుత్రా థాయిలాండ్‌లో అరెస్ట్ కావడం సరైనదే అని.. కానీ వారు బందీగా ఉండిపోవాలని ఆమె డిమాండ్ చేశారు.
"నష్టపరిహారం భిక్షలా అనిపిస్తోంది"
ఈ విషాదంలో 25 మంది మరణించినట్లు అధికారిక లెక్క ఉన్నప్పటికీ.. గాయపడినవారు లేదా గల్లంతైనవారు ఎక్కువ మంది ఉండవచ్చని జోషి అనుమానం వ్యక్తం చేశారు. ఆమె కోల్పోయిన కుటుంబ సభ్యుల కారణంగా ఇప్పుడు నలుగురు పిల్లలు (ముగ్గురు మేనకోడళ్లు/మేనల్లుళ్లు, ఇద్దరు సొంత పిల్లలు) ముగ్గురు వృద్ధులను పోషించే బాధ్యత తనపై పడిందన్నారు. గోవా ప్రభుత్వం రూ. 5 లక్షలు, కేంద్ర ప్రభుత్వం రూ. 2 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించినప్పటికీ.. అధికారుల నుంచి పదేపదే ఫోన్ కాల్స్ రావడంతో తనకు మరింత బాధ కలుగుతోందని జోషి చెప్పారు. తనకు ఆ పరిహారం కూడా వద్దని.. ఎందుకంటే అది లాంఛనంలా ఉందన్నారు. తమా మౌనాన్ని కొనడానికి ప్రయత్నిస్తున్నట్లు ఉందన్నారు. ఇది భిక్షం ఇస్తున్నట్లు అనిపిస్తోందని.. తనకు అలాంటి భిక్షం వద్దని ఆమె అన్నారు. పోషించే వారే లేని ఈ పరిస్థితుల్లో, ఆ డబ్బుతో ఎలా నిర్వహించగలను, బదులుగా తనకు ఒక ఉద్యోగం కావాలని ఆమె కోరారు.
Latest News