|
|
by Suryaa Desk | Sat, Dec 13, 2025, 10:57 PM
యోగాలో ప్రతీ సమస్యకి పరిష్కారమున్నట్లుగానే జుట్టు సమస్యల్ని దూరం చేసి జుట్టు పెరగడానికి కొన్ని యోగాసనాలు హెల్ప్ చేస్తాయి. ముఖ్యంగా యోగా ముద్రలు జుట్టు సమస్యల్ని దూరం చేసి జుట్టు రాలడాన్ని అరికట్టి ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. అలాంటి కొన్ని ఆసనాల గురించి తెలుసుకుందాం. వీటిని మనం రెగ్యులర్‌గా చేస్తే చాలా వరకూ జుట్టు సమస్యలు తగ్గుతాయి. ఇవి నరాలని ఉత్తేజపరిచి బ్లడ్ సర్క్యూలేషన్ సరిగ్గా జరిగేలా చేస్తాయి. లోపలి నుంచి రక్త సరఫరాని మెరుగ్గా చేసి జుట్టుని బలంగా పెంచడంలో హెల్ప్ చేస్తాయి. అలా జరగడానికి కొన్ని యోగా ముద్రలు హెల్ప్ చేస్తాయి. అలాంటి యోగా ముద్రల గురించి యోగా ఇన్‌స్ట్రక్టర్ మనీషా చెబుతోంది. అవేంటో తెలుసుకుని వాటిని ఎలా చేయాలో తెలుసుకుందాం.
పృథ్వీ ముద్రతో జుట్టు సమస్యలు దూరం
ఈ ముద్ర చేయడం వల్ల జుట్టు కుదుళ్ళు బలంగా మారతాయి. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. హెయిర్ ఫోలికల్స్ నరీష్ అవుతాయి. కాబట్టి, దీనిని చేయడం చాలా మంచిది. దీనికోసం ముందుగా పద్మాసనంలో కూర్చోవాలి. చేతిని చాచి ఉంగరం వేలుని బొటనవేలుతో కలపండి. ఇలా రెండు చేతులతో చేసి శ్వాస ప్రక్రియలు కొనసాగించండి.
ప్రాణ ముద్ర ఎలా చేయాలి?
ప్రాణ ముద్ర కూడా జుట్టు సమస్యల్ని దూరం చేయడంలో చాలా బాగా హెల్ప్ చేస్తుంది. రక్త సరఫరాని మెరుగ్గా చేస్తుంది. స్కాల్ప్‌కి సరైన విధంగా, రక్తాన్ని సరఫరా చేస్తుంది. దీంతో పాటు ఆక్సీజన్ సరఫరా చేసి జుట్టు బలంగా మారేలా చేస్తుంది. దీనిని ఎలా చేయాలంటే పద్మాసనంలో కూర్చోని ఉంగరం చిటికెన వేలుని మడిచి బొటనవేలుతో కలపాలి. ఇలా రెండు చేతులతో చేసి శ్వాస ప్రక్రియల్ని కొనసాగించండి.
జ్ఞాన ముద్రతో మరిన్ని లాభాలు
జ్ఞాన ముద్ర చేయడం వల్ల కూడా చాలా వరకూ జుట్టు సమస్యలు దూరమవ్వడానికి హెల్ప్ చేస్తాయి. దీనికోసం ఏం చేయాలంటే చూపుడు వేలుని బొటనవేలుతో కలిపి రెండింటిని పైకి లేపాలి. ఇలా ఈ యోగా ముద్రలోనే ఉండి శ్వాసప్రక్రియలు కొనసాగించాలి. దీని వల్ల హార్మోన్స్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే జుట్టు సమస్యలు దూరమవుతాయి.
వాయు ముద్రతో కూడా సరైన రిజల్ట్స్
వాయు ముద్ర.. ఇది డాండ్రఫ్‌ని దూరం చేస్తుంది. అంతేకాకుండా, జట్టు మధ్యలో చిట్లిపోవడం, డ్రైనెస్ వంటి సమస్యల్ని తగ్గిస్తుంది. దీనిని ఎలా చేయాలంటే ముందుగా పద్మాసనంలో కూర్చోవాలి. చూపుడువేలుని బొటనవేలుతో మూయాలి. ఇలా రెండు చేతులతో చేసి శ్వాసప్రక్రియలు కొనసాగించాలి.
బాలాయంతో జుట్టు సమస్యలు దూరం
బాలాయం చేయడం వల్ల కూడా జుట్టు బలంగా, ఒత్తుగా పెరుగుతుంది. పైగా జుట్టు రాలడం తగ్గుతుంది. ముందుగా తెల్లబడడం తగ్గుతుంది. దీనికోసం పద్మాసనంలోనే కూర్చుని రెండు చేతుల వేళ్ళని మడిచి గోర్లని కలిపేలా రబ్ చేయాలి. వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది.
జుట్టు సమస్యల్ని దూరం చేసే యోగా ముద్రలు
ఏయే ఆయిల్స్ హెల్ప్ చేస్తాయి
నెయ్యిలో కొద్దిగా విటమిన్ ఈ ఆయిల్ కలిపి, అందులోనే కొన్ని చుక్కల రోజ్‌మెరీ ఆయిల్ వేసి స్కాల్ప్‌కి మసాజ్ చేయండి. దీని వల్ల జుట్టు సమస్యలు దూరమవుతాయి.
ఆముదంలో రెండు విటమిన్ ఈ క్యాప్సూల్స్‌ని చిదిమి ఆ ఆయిల్‌ని కలిపి రాయండి.
కొబ్బరినూనెలో విటమిన్ ఈ క్యాప్సూల్స్ నుంచి తీసిన ఆయిల్ కొన్ని చుక్కల రోజ్‌మెరీ ఎసెన్షియల్ ఆయిల్ వేసి బాగా కలిపి జుట్టు, స్కాల్ప్‌కి రాయండి.
మనీషా ప్రకారం, తన జుట్టుకి నెయ్యి చాలా బాగా వర్క్ అయిందని. దీని వల్ల స్కాల్ప్ మాయిశ్చర్ అయి జుట్టు ఒత్తుగా పెరిగిందని చెబుతున్నారు.
Latest News