|
|
by Suryaa Desk | Sun, Dec 14, 2025, 04:39 PM
విశాఖపట్నం నగరంలోని బీచ్ రోడ్డులో ఆదివారం ఉదయం వైజాగ్ నేవీ మారథాన్ 2025 అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ఈ మారథాన్‌లో సుమారు 18 వేల మంది రన్నర్లు పాల్గొన్నారు. 17 దేశాలకు చెందిన విదేశీ అథ్లెట్లు కూడా ఈ పరుగులో పాల్గొనడం విశేషం. మొత్తం 42కే, 21కే, 10కే, 5కే విభాగాల్లో ఈ పోటీలను నిర్వహించారు.తూర్పు నౌకాదళాధిపతి సంజయ్ బల్లా 42కే ఫుల్ మారథాన్‌ను జెండా ఊపి ప్రారంభించగా, ఆయన సతీమణి ప్రియా బల్లా 21కే రన్‌ను ప్రారంభించారు. 10కే పరుగును జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, 5కే పరుగును నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ప్రారంభించారు. మారథాన్ నేపథ్యంలో బీచ్ రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు విధించి, పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Latest News