|
|
by Suryaa Desk | Mon, Dec 15, 2025, 10:56 AM
AP: ప్రభుత్వం కేంద్రం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) పథకాన్ని రాష్ట్రంలో పునఃప్రారంభించింది. ఈ పథకం కింద, పేద మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందిస్తున్నారు. ఈనేపథ్యంలో ఉచితంగా సిలిండర్, రెగ్యులేటర్, పైపు, గ్యాస్ పుస్తకం, బిగింపు ఖర్చులన్నీ ఆయిల్ కంపెనీలే భరించనున్నాయి. అలాగే మొదటి సిలిండర్ ఉచితం, ఆ తర్వాత రూ.300 రాయితీ లభిస్తుంది. దీనివల్ల సామాన్యులకు గ్యాస్ వాడకం మరింత అందుబాటులోకి వస్తుంది.
Latest News